Mahesh Babu : ‘హ్యాపీ బర్త్ డే NSG’ : మహేష్ బాబు

సూపర్ స్టార్ మహేష్ బాబు కి ఫ్యామిలీ అంటే ఎంత ప్రేమో అందరికి బాగా తెల్సిన విషయమే. ఎందుకంటే మూవీ షూటింగ్స్ లో ఎంత బిజీగా ఉన్నా కూడా కుటుంబానికి కేటాయించే సమయంలో ఏ మాత్రం తక్కువ కానివ్వరు సూపర్ స్టార్ మహేష్. షూటింగ్స్ నుంచి కొంచం ఖాళీ దొరికితే చాలు ఫ్యామిలీ తో ఫారెన్ ట్రిప్స్ కి ప్లాన్ చేస్తుంటారు మహేష్. సినిమాలలో సూపర్ స్టార్ అవ్వచ్చు కానీ, తన కుటుంబానికి మాత్రం ఒక మంచి భర్తగా, మంచి తండ్రిగా అందరికి ఆదర్శముగా నిలుస్తుంటారు. వీటి వెనుక తన భార్య నమ్రత శిరోద్కర్ కృషి ఎంతో ఉందనడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఈరోజు ఆమె పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియా వేదికగా మహేష్ ఈ కింది విధంగా శుభాకాంక్షలు తెలిపారు.

Mahesh Babu

‘హ్యాపీ బర్త్ డే NSG.. ప్రతి విషయంలో వెలకట్టలేని నీ ప్రేమతో నా వెంటే తోడుగా ఉన్నావ్, అంతకంటే ఎక్కువ నేనేం కోరుకొను’ అంటూ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేసారు. మహేష్ బాబు & నమ్రత 2004 లో సినిమా షూటింగ్ సమయంలో ప్రేమలో పడగా, ఇరువురి కుటుంబాల అంగీకారంతో ముంబైలో 2005 లో వివాహబంధం ద్వారా ఒక్కటయ్యారు. ఆ తరువాత నమ్రత హౌస్ వైఫ్ గా మారిపోయారు. సినిమాలను పూర్తిగా పక్కన పెట్టేసి తన కుటుంబానికే ఫుల్ టైం కేటాయిస్తూ, మహేష్ బాబు షూటింగ్స్ , ట్రిప్స్ , సోషల్ వర్క్స్ , ఆర్థిక వ్యవహారాలు అన్ని చక్కగా ప్లాన్ చేస్తున్నారు. పిల్లలకి కూడా సామాజిక స్పృహ మీద అవగాహన కల్పిస్తూ వారిని సరైన మార్గంలో పెంచుతున్నారు నమ్రత. ఈ విధంగా తన భర్త & పిల్లల పట్ల అమితమైన ప్రేమను చూపిస్తూ వారి వారి వ్యవహారాలన్నీ ఎప్పటికప్పుడు చక్కబెడుతూ ఒక ఆదర్శ గృహిణిగా పేరు తెచ్చుకున్నారు నమ్రత.

ENE 2: కార్తీక్ క్యారెక్టర్ రీప్లేస్‌మెంట్.. తరుణ్ భాస్కర్ ముందున్న అతిపెద్ద సవాల్ అదే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus