‘జనగణమణ’ తీయడానికి ప్రభాస్ ని కాకా పడుతున్నాడా?

పూరి జగన్నాథ్ ఈ మధ్యే ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో హిట్టందుకున్నాడు. కాదు.. కాదు… బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. పూరి సక్సెస్ ట్రాక్ లోకి ఎంట్రీ ఇస్తే ఎలా ఉంటుందో ఈ ఒక్క సినిమాతో చూపించాడు. ఇక ఇప్పుడు సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ తో ఓ సినిమా చేస్తున్నాడు. దీనికి ‘ఫైటర్’ అనే టైటిల్ అనుకుంటున్నట్టు సమాచారం. ఇక ఇది పూర్తయిన తరువాత పూరి ప్లాన్ ఏంటి అన్నది… ఇప్పుడు అందరిలోనూ ఉన్న పెద్ద సందేహం. ఇప్పటి వరకూ స్టార్ హీరోలందరిని డైరెక్ట్ చేశాడు పూరి. అయితే తన యాటిట్యూడ్ తో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు వంటి హీరోల పై కామెంట్స్ చేసి వాళ్ళ ఫ్యాన్స్ కు పెద్ద శత్రువయ్యాడు.

ఈ క్రమంలో మహేష్ తో ‘జనగణమణ’ అనే కథ చెప్పాడు. కానీ వరుస కమిట్మెంట్స్ తో మహేష్ బిజీగా ఉండడం వలన ఇప్పుడు చేయలేను తరువాత చూద్దాం అని చెప్పాడట మహేష్. దీంతో ‘నేను హిట్లలో ఉంటేనే మహేష్ నాతో సినిమా చేస్తాడు’ అనే కామెంట్ విసిరి పాగా తీర్చుకున్నాడు. కానీ పూరి మాత్రం ఇప్పుడు సక్సెస్ ఫుల్ హీరోలతోనే పనిచేస్తున్నాడు. ఇది పక్కన పెడితే… ‘జనగణమణ’ పూరి డ్రీమ్ ప్రాజెక్ట్ కాబట్టి దానిని ‘పాన్ ఇండియా’ చిత్రంగా మలచాలని తెగ ప్రయత్నాలు చేస్తున్నాడట. మొదటగా ‘కె.జి.ఎఫ్’ హీరో యష్ ను కలిసి కథ వినిపించాడు. అయితే యష్ పూర్తి స్థాయిలో ఓకే చెప్పలేదు. దీంతో మన డార్లింగ్ ప్రభాస్ వద్దకు వచ్చాడట. పూరి అంటే ప్రభాస్ కు బాగా ఇష్టం. ఇప్పటి వరకూ పెద్ద ప్రాజెక్టులతో 6 ఏళ్ళు బిజీగా ఉన్నాడు కాబట్టి.. ప్రభాస్ ను డిస్టర్బ్ చేయలేదు పూరి. కానీ తాజాగా ప్రభాస్ ను కలిశాడట పూరి. కథా చర్చలు కూడా జరిగాయట. ‘సాహో’ తో ప్రభాస్ ‘పాన్ ఇండియా’ హీరోనే అని మరోసారి ప్రూవ్ అయ్యింది కాబట్టి. ప్రభాస్ తోనే ‘జనగణమణ’ చేయాలని మెల్ల మెల్లగా పూరి ట్రై చేస్తున్నాడని తెలుస్తుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus