సంక్రాంతి బరి నుంచి తప్పుకొన్న సూపర్ స్టార్

  • July 3, 2018 / 12:16 PM IST

మన తెలుగు నూతన సంవత్సరమైన ఉగాదినాడు వచ్చే ఏడాది మహేష్ ఫ్యాన్స్ రెండు పండగరు జరుపుకోనున్నారు. ఒకటి మన తెలుగు కొత్త సంవత్సరం వేడుకలైన ఉగాది వేడుకలు కాగా.. రెండోది సూపర్ స్టార్ మహేష్ బాబు 25వ సినిమా విడుదల. సాధారణంగా సంక్రాంతి లేదా దసరాకి వస్తుండే మహేష్ ఈసారి కొత్తగా ఉగాదికి రానున్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మహేష్ 25వ చిత్రం విడుదల విషయంలో నిన్నమొన్నటివరకూ చాలా కన్ఫ్యూజన్ ఉండేది. సంక్రాంతికి వస్తాడని కొందరు, ఫిబ్రవరి అని ఇంకొందరు, సమ్మర్ అని కొందరు అంటూ వచ్చారే కానీ క్లారిటీ మాత్రం ఇవ్వలేదు.

అయితే.. ఈ కన్ఫ్యూజన్ ను పోగొట్టడానికి స్వయంగా నిర్మాణ సంస్థ పి.ఆర్ టీం రంగంలోకి దిగి.. ఏప్రిల్ 5న ఉగాది పండుగ సందర్భంగా మహేష్ 25వ సినిమాని విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.; మహేష్ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో అల్లరి నరేష్ ముఖ్యపాత్ర పోషిస్తున్నాడు. దిల్ రాజు-అశ్వినీదత్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం మహేష్ ట్రై చేసిన కొత్త లుక్ ప్రస్తుతం వైరల్ అయ్యింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus