వెండితెర పై హిట్టయినా.. బుల్లితెర పై ప్లాప్ అయ్యింది..!

  • October 18, 2019 / 01:34 PM IST

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు 25 వ చిత్రంగా వచ్చిన ‘మహర్షి’ చిత్రం ఎంత పెద్ద హిట్టయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వంశీ పైడిపల్లి డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం 100 కోట్ల పైనే షేర్ ను రాబట్టి… మహేష్ కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాగా నిలిచింది. ‘రైతుల పై చూపించాల్సింది జాలి కాదు మర్యాద’ అనే థీమ్ కు అద్భుతమైన స్పందన లభించింది. ఇక ‘అమెజాన్’ ప్రైమ్ లో కూడా ‘మహర్షి’ చిత్రానికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం కొన్న ‘అమెజాన్’ వారు లాభాల పొందినట్టు తెలుస్తుంది. అయితే ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ కొన్న ‘జెమిని’ వారికి మాత్రం నష్టాలే మిగిల్చేలా ఉంది.

‘జెమిని టివి’ లో ‘మహర్షి’ చిత్రం ప్రీమియర్ ను టెలికాస్ట్ చేయగా రేటింగ్ ఆశించిన స్థాయిలో రాలేదు. 15 నుండీ 20 వరకూ టీ.ఆర్.పి వస్తుంది అనుకుంటే 8.4 టీ.ఆర్.పి మాత్రమే రావడం గమనార్హం. ఇలా 10 లోపే టీ.ఆర్.పి రావడం జెమిని వారికి మంచి షాక్ తగిలినట్టే అయ్యింది. ఈ మధ్య ఒక్క ‘భరత్ అనే నేను’ సినిమా పక్కన పెడితే మహేష్ ‘బ్రహ్మోత్సవం’ ‘స్పైడర్’ లకు ఘోరమైన టి.ఆర్.పి వచ్చింది. అయితే అవి ప్లాప్ సినిమాలు కాబట్టి తక్కువ టి.ఆర్.పి వచ్చింది. దీనికి అసలు కారణం ఏంటా అని ఆలోచిస్తే.. సమ్మర్ లో సినిమా విడుదలైంది కాబట్టి చాలా వరకూ థియేటర్లలో చూసేసారు ప్రేక్షకులు. ఇక టీవీ లో టెలికాస్ట్ కావడం లేట్ అవ్వడం.. ముందుగానే అమెజాన్ ప్రైమ్ లో అందరూ ‘మహర్షి’ సినిమా చూసేసారు కాబట్టి ఇంత తక్కువ రేటింగ్ వచ్చినట్టు తెలిస్తుంది.

బాలీవుడ్ లో మంచి కలెక్షన్లు రాబట్టిన సౌత్ సినిమాలు..?
చిరంజీవి అతిధి పాత్ర చేసిన సినిమాలు?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus