‘మహర్షి’ హిట్టు కొట్టాడు కానీ ..!

  • July 8, 2019 / 06:13 PM IST

మహేష్ బాబు 25 వ చిత్రంగా వచ్చిన ‘మహర్షి’ ఫుల్ రన్ ముగిసింది. వంశీ పైడిపల్లి డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం మహేష్ కెరీర్లో మొదటి సారి 100 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసింది. ‘భరత్ అనే నేను’ అంత బ్లాక్ బస్టర్ టాక్ రాకపోయినా… సమ్మర్ హాలిడేస్ ను బాగా క్యాష్ చేసుకుంది ‘మహర్షి’. ప్రస్తుత సమాజం లో రైతు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు.. మనం రైతుల పై చుపించాల్సింది ‘జాలి కాదు మర్యాద’ అనే సబ్జెక్టు కి అన్ని కమర్షియల్ ఎలెమెంట్స్ ను తగిలించి ప్రేక్షకులకి వడ్డించాడు దర్శకుడు. మొత్తంగా ‘మహర్షి’ 101.61 కోట్ల షేర్ వచ్చింది.

ఇక ‘మహర్షి’ క్లోజింగ్ కలెక్షన్లు ఈ విధంగా ఉన్నాయి :

నైజాం – 29.90 కోట్లు
సీడెడ్ – 10.10 కోట్లు
వైజాగ్ – 10.90 కోట్లు

ఈస్ట్ – 7.18 కోట్లు
వెస్ట్ – 6.05 కోట్లు
కృష్ణా – 5.80 కోట్లు

గుంటూరు – 7.80 కోట్లు
నెల్లూరు – 2.78 కోట్లు
———————————————
ఏపీ + తెలంగాణా – 80.51 కోట్లు
(టోటల్)

రెస్ట్ అఫ్ ఇండియా – 10.70 కోట్లు
ఓవర్సీస్ – 10.40 కోట్లు
———————————————
వరల్డ్ వైడ్ టోటల్ – 101.61 కోట్లు (షేర్)
———————————————

‘మహర్షి’ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా 95 కోట్ల వరకూ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఫుల్ రన్లో వరల్డ్ వైడ్ గా 101.61 కోట్ల షేర్ వచ్చింది. మొత్తంగా ఈ చిత్రం హిట్ లిస్ట్ లో చేరింది. అయితే ఓవర్సీస్, సీడెడ్, నెల్లూరు వంటి ఏరియాల్లో నష్టాలు వచ్చాయి. మొదట్లో కాస్త తడబడినా చివరికి స్టడీ గా బ్రేక్ ఈవెన్ అయ్యింది ‘మహర్షి’ చిత్రం. టాలీవుడ్ ఆల్ టైం టాప్ 5 గా ఈ చిత్రం నిలిచింది. నైజాం లో ఈ చిత్రానికి మంచి లాభాలు వచ్చాయి.. అలాగే ‘నాన్ బాహుబలి’ రికార్డు కూడా దక్కించుకుంది. 25 వ చిత్రంతో పవన్, ఎన్టీఆర్ ల ‘అజ్ఞాతవాసి’ ‘నాన్నకు ప్రేమతో’ చిత్రాలు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయినా… మహేష్ 25 మాత్రం హిట్ గా నిలిచింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus