మహేష్ ‘మహర్షి’ కథ అదేనంట..!

  • January 8, 2019 / 10:19 AM IST

‘బ్రహ్మోత్సవం’ ‘స్పైడర్’ వంటి డిజాస్టర్లతో డీలా పడిపోయిన మహేష్ వెంటనే ‘భరత్‌ అనే నేను’ చిత్రంతో బౌన్స్ బ్యాక్ అయ్యాడు. ప్రస్తుతం మహేష్ నటిస్తున్న ‘మహర్షి’ చిత్రంతో విజయపరంపర కొనసాగించాలని చాలా కష్టపడుతున్నాడు. వంశీ పైడిపల్లి డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మహేష్‌ బియర్డ్‌ లుక్‌ తో కనిపించబోతున్నాడు. దానికి తోడు స్టైలిష్ గా ఉండే ఓ పోస్టర్‌ను న్యూ ఇయర్ కానుకగా విడుదల చేయగా… దానికి అద్భుతమైన స్పందన లభించింది. ‘మహర్షి’ చిత్రం మహేష్ కు 25 వ సినిమా కాబట్టి.. ఈ చిత్రం పై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఇక ఈ చిత్ర కథ ఇదేనంటూ ఫిలింనగర్లో ఓ వార్త చక్కర్లుకొడుతుంది.

ఆ చిత్ర కథ విషయానికొస్తే… భారత దేశం మొదటి నుండీ వ్యవసాయ ఆధార దేశమైనప్పటికీ.. పరిస్దితులు బాగోకపోవడంతో పాటు.. ప్రభుత్వాలు కూడా సహకరించక, వ్యవసాయం దండగ అనే అభిప్రాయానికి వచ్చేస్తున్నారు రైతులు . పంట పొలాలను అమ్మేసుకోని సిటీలకు వలస వెళ్ళిపోతున్నారు. మరికొంతమంది అప్పుల బాధతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు . దీనికంతటికి కారణం రైతుకి సరైన గిట్టుబాటు ధర రాకపోవడం..వ్యవసాయానికి ఎక్కువ ఖర్చు కావటం..అది వెనక్కి తిరిగి రాకపోవటం. ఇలాంటి అంశాలనే ప్రధానాంశంగా.. ఈ చిత్రంలో తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. అంతేకాదు ఆధునిక పద్దతులతో వ్యవసాయం చేస్తే..

అది దండగ కాదని… వ్యవసాయం పండగ… అనే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కబోతున్నట్టు తెలుస్తోంది. ఈ కథ మొత్తం రాయలసీమ లో వర్షాభావ పరిస్థితులు చుట్టూ తిరుగుతుందని ఫిలింనగర్ విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు. మహేష్ బాబు హీరోగా నటించిన మొదటి చిత్రం ‘రాజకుమారుడు’ అలాగే.. మహేష్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్టయిన ‘శ్రీమంతుడు’ చిత్రాలు కూడా వ్యవసాయానికి సంబందించిన కథాంశాలే.. కాబట్టి వాటి స్థాయిలోనే ఈ చిత్రం కూడా సూపర్ హిట్ అవ్వడం కాయమని కొందరు మహేష్ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. మరి ‘మహర్షి’ ఏ స్థాయి విజయం సాధిస్తుందో తెలియాలంటే ఏప్రిల్ వరకు వేచి చూడక తప్పదు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus