Pokiri 4K Dolby: మహేష్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించే వార్త ఇదే!

మహేష్ బాబు సినీ కెరీర్ లోని ప్రత్యేకమైన సినిమాలలో పోకిరి సినిమా ఒకటని చెప్పవచ్చు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సృష్టించిన సంచలనాలు అన్నీఇన్నీ కావు. 2006 సంవత్సరంలో విడుదలైన ఈ సినిమా ఏకంగా 40 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సొంతం చేసుకుని బాక్సాఫీస్ వద్ద రికార్డులను క్రియేట్ చేయడం గమనార్హం. ఈ జనరేషన్ యూత్ కు కూడా పోకిరి సినిమా ఎంతగానో నచ్చుతుందని చెప్పవచ్చు.

క్లైమాక్స్ లోని షాకింగ్ ట్విస్ట్ ఈ సినిమా రేంజ్ ను పెంచిందని చెప్పవచ్చు. అయితే ఈ సినిమా మళ్లీ థియేటర్లలో రిలీజ్ కానుంది. ఫ్యాన్స్ కు షాకింగ్ గా అనిపించినా మహేష్ బాబు పుట్టినరోజు కానుకగా ఈ సినిమా థియేటర్లలో రీ రిలీజ్ కానుందని సమాచారం అందుతోంది. ఆగష్టు 9వ తేదీన పరిమిత సంఖ్యలో థియేటర్లలో 4కే రిజొల్యూషన్ లోకి రీమాస్టర్ చేసి డాల్బీ ఆడియోతో ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయనున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

పోకిరి రీ రిలిజ్ విషయంలో డిఫరెంట్ స్ట్రాటెజీని ఫాలో అవుతున్నారని ఎక్కువ సంఖ్యలో థియేటర్లలో ఈ సినిమా రీ రిలీజ్ కానుందని తెలుస్తోంది. పోకిరిని అప్పుడు థియేటర్లలో చూడటం మిస్సైన వాళ్లు సైతం మహేష్ పుట్టినరోజున ఈ సినిమాను థియేటర్లలో చూసే అవకాశం ఉంది. గతంలో మహేష్ నటించిన పలు సినిమాలు రీ రిలీజ్ లో కూడా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ ను అందుకున్నాయి.

మహేష్ బాబు త్వరలో త్రివిక్రమ్ డైరెక్షన్ లో తెరకెక్కే సినిమా షూట్ లో పాల్గొననున్నారు. భారీ బడ్జెట్ తో హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుందేమో చూడాల్సి ఉంది. సినిమాసినిమాకు మహేష్ బాబుకు క్రేజ్ పెరుగుతుండగా మహేష్ తర్వాత ప్రాజెక్ట్ లపై కూడా అంచనాలు అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.

ది వారియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus