లిటిల్ చెఫ్ గా సూపర్ స్టార్ ముద్దుల కూతురు

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు చిన్నారి సితార స్వీట్ పనితో మళ్లీ వార్తల్లోకి ఎక్కింది. మూడేళ్లకే తన తండ్రి పాటలకు అద్భుతంగా డ్యాన్స్ చేసి అభినందనలు అందుకున్న లిటిల్ ప్రిన్సెస్  మరో మారు శెభాష్ అనిపించుకుంది. చాక్లెట్ల కోసం మారం చేసే వయసులో చాక్లెట్ ని తయారు చేసి ఆశ్చర్య పరిచింది.

ప్రముఖ చెఫ్ ఆధ్వర్యంలో అతని సూచనలు పాటిస్తూ సితార చేసిన చాక్లెట్ అందరికీ భలే నచ్చింది. ముద్దు ముద్దు మాటలతో ఆడుకునే పాపాయి యాప్రిన్ కట్టుకుని కిచెన్ లో కష్టపడుతుంటే తల్లి నమ్రత ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. సితార ఫోటోలను తీస్తూ కూర్చింది. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తన సంతోషాన్ని అభిమానులతో పంచుకుంది. సితార ఫోటోలు లైకులు, షేర్లు అందుకుంటోంది. మహేష్ బాబు, నమ్రత.. ఇద్దరూ ఇప్పటికీ గరిట పట్టలేదు. వారి కూతురు మాత్రం నాలుగేళ్లకే లిటిల్ చెఫ్ గా అవతారం ఎత్తింది. సితార చేసిన పనికి తండ్రిగా సూపర్ స్టార్ ఏ విధంగా మురిసి పోయి ఉంటారో…!!

The chocolate makers ❤️❤️

A photo posted by Namrata Shirodkar (@namratashirodkar) on

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus