Sitara: వామ్మో.. సితార ధరించిన లెహంగా ఖరీదు అన్ని రూ.లక్షలా?

సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సితారకు ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనే సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో స్టార్ హీరోయిన్ల స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్న సితార రెడ్ కలర్ లెహంగాకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతుండగా ఆ ఫోటోలు హాట్ టాపిక్ అవుతున్నాయి. సితారకు సొంతంగా యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది.

సితార ధరించిన లెహంగా ఖరీదు 2 లక్షల రూపాయల కంటే ఎక్కువ మొత్తం కాగా ఈ విషయం తెలిసి నెటిజన్లు సైతం ఆశ్చర్యానికి గురవుతున్నారు. సెలెబ్రిటీ డిజైనర్ వరుణ్ చక్కిలం ఈ డ్రెస్ ను డిజైన్ చేశారు. సితార ఇప్పటికే ప్రముఖ కంపెనీల బ్రాండ్స్ కు అంబాసిడర్ గా వ్యవహరిస్తూ ప్రశంసలను అందుకుంటున్నారు. సరైన ప్రాజెక్ట్ లతో సితార సినిమాల్లోకి వస్తే కెరీర్ పరంగా తిరుగుండదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

సితార (Sitara) సినిమాల్లోకి వస్తే భారీ స్థాయిలో రెమ్యునరేషన్ ఇవ్వడానికి సైతం నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు. సితార చదువు పూర్తైన తర్వాతే సినిమాల్లోకి రావాలని మరి కొందరు చెబుతున్నారు. గౌతమ్ సినీ ఎంట్రీ కోసం అభిమానులు ఒకింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారనే సంగతి తెలిసిందే. వయస్సు పెరుగుతున్నా సూపర్ స్టార్ మహేష్ బాబు మాత్రం ఇంకా యంగ్ గా కనిపిస్తున్నారు. మహేష్ బాబు గుంటూరు కారం సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంటారేమో చూడాలి.

గత కొన్నేళ్లుగా కమర్షియల్ సినిమాలకు ఎక్కువగా ఓటేస్తునా మహేష్ బాబు ఈ సినిమాలతో అదిరిపోయే సక్సెస్ లను అందుకుంటున్నారు. మహేష్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది. మహేష్ రాజమౌళి కాంబినేషన్ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతుండగా ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాల్సి ఉంది. కెరీర్ విషయంలో మహేష్ ఆచితూచి అడుగులు వేస్తున్నారు.

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus