సాయి ధరమ్ తేజ్ తో ‘పిల్లా నువ్వు లేని జీవితం’ రాజ్ తరుణ్ తో ‘లవర్’ చిత్రాలను నిర్మించిన సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సహోదరుడి కొడుకు హర్షిత్ రెడ్డి వివాహం తాజాగా గోవాలో జరిగింది. ఆదోని వైసీపీ ఎమ్మెల్యే వై సాయి ప్రసాద్ రెడ్డి కుమార్తె గౌతమి తో హర్షిత్ వివాహం డిసెంబర్ 21 న జరిగింది. బంధువులు, సన్నిహితులు మధ్య చాలా అట్టహాసంగా ఈ వివాహం జరిగింది.
ఈ వేడుకకు కేవలం బంధు మిత్రులని మాత్రమే పిలవడంతో వివాహానంతరం డిసెంబర్ 23న రిసెప్షన్ గ్రాండ్ గా నిర్వహించారు. ఇక ఈ వేడుకకి సినీ ఇండస్ట్రీ నుండీ దిల్ రాజు సన్నిహితులైన వారందరికీ ఆహ్వానాలు వెళ్ళాయట. దాదాపు పిలిచిన వారంతా వచ్చి వధూవరులను దీవించినట్టు తెలుస్తోంది. ఇక ఈ వేడుకకి మహేష్ బాబు, నాని, రాశి ఖన్నా, కెవిపి రామ చంద్రరావు, కిరణ్ కుమార్ రెడ్డి, సి అశ్వనీదత్, వంశీ పైడిపల్లి వంటి సినీ, రాజకీయ ప్రముఖులు విచ్చేసారు