Mahesh Babu: అఖిల్‌ ఫ్లాప్‌ మహేష్‌ ఫ్యాన్స్‌కు మంచి మేటర్‌ మిస్‌ చేసిందట

హిట్టు దర్శకుడు, రచయిత అంటే టాలీవుడ్‌లో బ్రహ్మరథం పడతారు. అడ్వాన్సులు ఇవ్వడానికి నిర్మాతలు వెంటపడితే, కథలు ఉంటే చెప్పండి హీరోల టీమ్‌ వెంటపడతారు. అయితే అదే దర్శకుడు, రచయిత ఫ్లాప్‌ కొట్టాడు అంటే ఇక పరిస్థితి చెప్పక్కర్లేదు. అప్పటిదాకా చుట్టూ తిరిగిన వారంతా దూరంగా పోతారు. అయితే ఇదంతా మన సినిమా జనాలకు తెలిసిన విషయమే. అచ్చంగా ఇలాంటి కారణం వల్లే ఒక కొత్త కాన్సెప్ట్‌ సినిమా మహేష్‌బాబు ఫ్యాన్స్‌ మిస్‌ అయ్యారా? అవుననే అంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు.

ఇదంతా ఆరేళ్ల క్రితం మాట… ‘అఖిల్‌’ సినిమాతో అఖిల్‌ను లాంచ్‌ చేస్తున్న టైమ్‌. వీవీ వినాయక్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఆ సినిమాపై టాలీవుడ్‌లో మంచి బజ్‌ నెలకొంది. అక్కినేని వారసుడి సినిమా కావడంతో హిట్‌ పక్కా అనుకున్నారు. ఆ సినిమా హిట్‌ అయితే టీమ్‌ మొత్తానికి మంచి పేరు వస్తుంది కదా అనుకున్నారు. అందులో సినిమా కథా రచయిత వెలిగొండ శ్రీనివాస్‌ కూడా ఉన్నారు. అంతేకాదు ఈ సినిమా తర్వాత మహేష్‌ బాబు హీరోగా ఓ సినిమా ప్లాన్‌ చేశారాయన.

సుమారు ₹100 కోట్ల బడ్జెట్‌తో ఏలియన్స్‌ ప్రధానాంశంగా ఆ సినిమా ఉంటుందని అప్పుడు వార్తలొచ్చాయి. దీంతో టాలీవుడ్‌లో ఇదో కొత్త కాన్సెప్ట్‌ అని అందరూ అనుకున్నారు. అయితే మహేష్‌కు ప్రయోగాలు అంతగా కలిసిరావు కాబట్టి ఇబ్బందేమో అనుకున్నవాళ్లూ ఉన్నారు. ‘నాని’, ‘1 నేనొక్కడినే’, ‘స్పైడర్‌’ అలా బెడిసికొట్టినవే కదా. అయితే ఈ ఏలియన్ కథ అంతవరకు రాలేదు. ‘అఖిల్‌’ ఫ్లాప్‌ అవ్వడంతో వెలిగొండ శ్రీనివాస్‌కు మహేష్‌తో సినిమా చేసే అవకాశం రాలేదు అంటుంటారు. ఏదైతేముంది అభిమానులకైతే కొత్త కాన్సెప్ట్ మిస్‌ అయ్యింది.

Most Recommended Video

‘పవన్ కళ్యాణ్’ హీరోగా రూపొందిన 11 రీమేక్ సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
పెళ్లయ్యి కూడా పెళ్లి కానట్టు ఉండే 10 మంది టాలీవుడ్ భామల లిస్ట్..!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus