Mahesh Babu: మహేష్‌ ఫ్యాన్స్‌ సిద్ధంగా ఉన్నారా?

మహేష్‌బాబుకే కాదు, అతని ఫ్యాన్స్‌కు కూడా మే 31 చాలా కీలకమైన రోజు. ఆ రోజు ఎప్పుడొస్తుందా అని అందరూ ఎదురుచూస్తుంటారు. కారణం ఆ రోజు సూపర్‌స్టార్‌ కృష్ణ పుట్టినరోజు. ఆ రోజున కచ్చితంగా మహేష్‌ నుండి అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఉంటుంటాయి. కొత్త సినిమా ప్రకటించడం కానీ, ముహూర్తం షాట్‌ తీయడంకానీ, ఫస్ట్‌లుక్‌లు రిలీజ్ చేయడం లాంటివి కానీ చేస్తుంటారు. మరి ఈ ఏడాది మే 31కి మహేష్‌ ఏం చేస్తాడు అంటూ అప్పుడే సోషల్‌ మీడియాలో చర్చ మొదలైంది.

మహేష్‌బాబు ప్రజెంట్ సిట్యువేషన్‌ చూసుకుంటే మే 31న రెండు సర్‌ప్రైజ్‌లు ఉండే అవకాశం ఉంది. అందులో ఒకటి ‘సర్కారు వారి పాట’ సినిమా ఫస్ట్‌లుక్ లేదా మోషన్‌ పోస్టర్‌. ఈ మధ్య చాలా చిత్రబృందాలు రెండూ కలిపి ఇస్తున్నాయి. కాబట్టి అదొక్కటి అనుకుందాం. మరి రెండో సర్‌ప్రైజ్‌ ఏంటి అనేది తెలియాలి. అయితే మహేష్ – త్రివిక్రమ్‌ సినిమా అనౌన్స్‌మెంట్‌ కానీ, ముహూర్తపు షాట్‌ కానీ ఉండొచ్చు అంటున్నారు. ఎలాగూ మహేష్‌ ముహూర్తపు షాట్లకు రాడు కాబట్టి. కనీసం సమాచారమైనా సర్‌ప్రైజ్‌ అవుతుంది.

వీటితోపాటు మహేష్‌ పుట్టిన రోజునాడు చాలా నిర్మాణ సంస్థలు ట్వీట్లు చేస్తాయి. వాటి ప్రకారం కూడా తర్వాత మహేష్‌ ఎవరితో సినిమా చేస్తాడు అనే విషయంలో క్లారిటీ వస్తుంది. ఇక రాజమౌళి సినిమాకు సంబంధించి కూడా సమాచారం వస్తుందనే పుకార్లు వినిపిస్తున్నాయి. ఛత్రపతి శివాజీ జీవితంలో కొన్ని అంశాల ఆధారంగా ఈ సినిమా ఉంటుందని కూడా అంటున్నారు. అయితే ఆ సినిమా గురించి ఏదైనా సమాచారం మే 31న ఇస్తారా అని కూడా అభిమానులు ఎదురుచూస్తున్నారు.

Most Recommended Video

‘పవన్ కళ్యాణ్’ హీరోగా రూపొందిన 11 రీమేక్ సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
పెళ్లయ్యి కూడా పెళ్లి కానట్టు ఉండే 10 మంది టాలీవుడ్ భామల లిస్ట్..!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus