సూపర్ స్టార్ మహేష్ బాబు, కొరటాల శివ కాంబినేషన్లో వచ్చిన మొదటి సినిమా శ్రీమంతుడు ఇండస్ట్రీ హిట్ సాధించింది. దీంతో వీరి కలయికలో రానున్న రెండో చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగినట్లుగా కొరటాల స్క్రిప్ట్ ని సిద్ధం చేశారు. ఆ స్క్రిప్ట్ పై డిస్కషన్ నిర్వహించడానికి హీరో, డైరక్టర్ కొన్ని రోజుల క్రితం మలేషియా వెళ్లారు. వీరి వెంట రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ కూడా ఉన్నారు. ముగ్గురు కలిసి కథను ఓ కొలిక్కి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. ట్యూన్స్ కూడా ఎలా ఉండాలో ఇప్పుడే డిసైడ్ చేయనున్నట్లు తెలిసింది. మరో రెండు రోజుల పాటు వీరు మలేషియాలోనే ఉండనున్నారు.
ఫిబ్రవరి 10 వ తేదీన నగరానికి రానున్నారు. తర్వాత రోజు నుంచి మురుగదాస్ మూవీ లాస్ట్ షెడ్యూల్ లో పాల్గొననున్నారు. ఈనెల 11 నుంచి ముంబై లో ప్రారంభం కానున్న ఈ షెడ్యూల్ తో మహేష్ 23 మూవీ టాకీ పార్ట్ పూర్తి అవుతుంది. అనంతరం మిగిలిన రెండు పాటల కోసం విదేశాలకు వెళ్లనున్నారు. ఆ తర్వాత కొరటాల శివ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ ఫిల్మ్ కి “భరత్ అను నేను” అనే పేరుని పరిశీలిస్తున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.