యూరప్ దేశాల్లో మొదలుకానున్న మహేష్, కొరటాల మూవీ

సూపర్ స్టార్ మహేష్ బాబుకి యూరప్ దేశాలైన ఇంగ్లాండ్, ఐర్లాండ్, స్కాట్లాండ్ అంటే చాలా ఇష్టం. తన భార్య, పిల్లలతో కలిసి విహారానికి ఎక్కువగా ఆ దేశాలకు వెళుతుంటారు. ఆ ఇష్టంతోనే “ఒన్” నేనొక్కడినే సినిమాని అక్కడే తెరకెక్కించారు. ఆ మూవీ ఆశించినంతగా విజయం సాధించకపోయినప్పటికీ ఆ ప్రాంతంపై ప్రిన్స్ కి మక్కువ తగ్గలేదు. అందుకే తన నెక్స్ట్ సినిమాని అక్కడే ప్రారంభించాలని ఫిక్స్ అయ్యారు.  ఏఆర్ మురుగాదాస్ డైరెక్షన్ లో మహేష్ చేస్తున్న మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది.

ఈ నెలాఖరుతో ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ అవుతుంది. దీని తర్వాత ఒక నెల విశ్రాంతి తీసుకుని మే నుంచి కొరటాల శివ ప్రాజక్ట్ ని పట్టాలెక్కించనున్నారు.  ‘భరత్ అనే నేను’ అనే  టైటిల్ ఫిక్స్ అయిన ఈ చిత్రం ఎక్కువభాగం ఇక్కడే జరుగుతుంది. కొంతభాగం యూరప్ లో సాగుతుంది. ముందుగా విదేశీ షెడ్యూల్ కంప్లీట్ చేయాలనీ మహేష్, కొరటాల డిసైడ్ అయ్యారు. ఆ పనుల్లోనే కొరటాల బృందం బిజీగా ఉంది.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus