‘మహర్షి’ షూటింగ్ వీడియో లీక్.. ఆందోళనలో చిత్ర యూనిట్..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న ‘మహర్షి’ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం పొల్లాచి షెడ్యూల్ ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం చితిరి షెడ్యూల్ ఫిబ్రవరి నుండీ మొదలు కానుంది. మరో నెల రోజుల్లో షూటింగ్ పూర్తవుతుందని సమాచారం. అయితే పొల్లాచిలో జరిగిన షూటింగ్ లో.. అక్కడ కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. అయితే ఈ షూటింగ్ కి సంబంధించిన కొన్ని పిక్స్, వీడియోలు లీక్ అయ్యాయి. ఇప్పుడు ఈ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడం గమనార్హం.

పల్లెటూరి ప్రాంతంలో చిత్రీకరణ జరగంతో.. అక్కడి జనం మహేష్ ని చూడడానికి ఎగబడ్డారు. వారిని సిబ్బంది అదుపు చేయలేకపోవడంతో ఇలాంటి పరిస్థితి ఎదురైనట్లు స్పష్టమవుతుంది. కొందరు ఈ చిత్ర షూటింగ్ కి సంబంధించిన కీలక సన్నివేశాన్ని వీడియో తీశారు. మహేష్ మీడియాతో ముచ్చటించే.. ఈ సన్నివేశానికి సంబంధించిన ఫోటో లీకైంది. ఇక ఈ ఫోటోలను మహేష్ అభిమానులే షేర్ లు చేస్తుండడం ఆశ్చర్యకరమైన విషయం. ఇక ఈ చిత్రంలో మహేష్ గుబురు గడ్డంతో కనిపించబోతున్నారు. వంశీ పైడిపల్లి డైరెక్షన్లో వస్తున్న.. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది, అల్లరి నరేష్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. దిల్ రాజు, అశ్వినీ దత్, ప్రసాద్.వి.పొట్లూరి కలిసి ఏ చిత్రాన్ని నిర్మిస్తుండగా దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ చిత్రాన్ని సమ్మర్ కానుకగా ఏప్రిల్ 25 న విడుదల చేయబోతున్నట్టు.. ఇప్పటికే చిత్ర నిర్మాతలలో ఒకరైన దిల్ రాజు క్లారిటీ ఇచ్చాడు. మహేష్ 25 వ చిత్రం కావడం.. అందులోనూ.. ‘వినయ విధేయ రామా’ తరువాత వచ్చే పెద్ద చిత్రం ఇదే కావడంతో… ఈ చిత్రం పై భారీ అంచనాలున్నాయి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus