మహేష్ ని భయపెడుతున్న సెంటిమెంట్లు..!

మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం ‘మహర్షి’. ఇది మహేష్ బాబుకి 25 వ చిత్రం కావడంతో… భారీ అంచనాలు నెలకొన్నాయి. వంశీ పైడిపల్లి డైరెక్షన్లో రూపొందుతున్న ఈ చిత్రం ముందుగా ఏప్రిల్ 5న రిలీజ్ చేయబోతున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. తరువాత ఏప్రిల్ 25న విడుదల చేయనున్నట్టు చిత్ర నిర్మాతలలో ఒకరైన దిల్ రాజు ప్రకటించాడు. అయితే ఇప్పుడు ఆ డేట్ కి కూడా ‘మహర్షి’ చిత్రం రావట్లేదని టాక్ వినిపిస్తుంది.

అసలు ఈ సమ్మర్ సీజన్లోనే ‘మహర్షి’ కాదట. ఈ చిత్రానికి కొంచెం ప్యాచ్ వర్క్ ఉండటంతో మరో వారం లేదా 2 వారాలు సమయం పట్టేలా ఉందట. అయితే ‘మే’ నెలలో సినిమా కంప్లీట్ అయినప్పటికీ… విడుదల మాత్రం జూన్ నెలలోనే చేయమని మహేష్ కోరాడట. దీనికి ముఖ్య కారణం మే నెల మరియు అక్టోబర్ నెలలో విడుదలైన మహేష్ బాబు సినిమాలన్నీ డిజాస్టర్లు గా మిగిలాయి. మహేష్ బాబు మే నెలలో విడుదలైన ‘నిజం’ ‘నాని’ ‘బ్రహ్మోత్సవం’ వంటి చిత్రాలు ఘోరమైన డిజాస్టర్లుగా మిగిలాయి. అందులోనూ మహేష్ కి ఇది 25 వ సినిమా. ఇటీవల విడుదలైన పవన్ కళ్యాణ్, నితిన్, గోపీచంద్, వంటి హీరోల 25 వ చిత్రాలు కూడా డిజాస్టర్లు అయ్యాయి.

ఒక్క జూ.ఎన్టీఆర్ ‘నాన్నకు ప్రేమతో’ చిత్రం పర్వాలేదనిపించినా కమర్షియల్ గా బ్రేక్ ఈవెన్ కాలేకపోయింది. ఈ దశలో మహేష్ తన 25 వ చిత్రానికి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. ఇంకా ఈ చిత్ర షూటింగ్ పూర్తి కాకపోవడం, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కి ఎక్కువ సమయం కావాల్సి ఉండడంతో సినిమాను వాయిదా వేయక తప్పట్లేదంట. ఈ చిత్రానికి సంబంధించి ఇంకా కొంత టాకీ పార్ట్ అలాగే రెండు పాటల చిత్రీకరణ బ్యాలన్స్ ఉంది. త్వరలోనే సినిమా రిలీజ్ డేట్ ని అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నట్టు తెలుస్తుంది. ఈ చిత్రం పోస్ట్ పోన్ కాబోతుందనే వార్త బయటకి రావడంతో మహేష్ అభిమానులు నిరుత్సాహానికి గురయ్యారు. మహేష్ కి బాగా కలిసొచ్చిన ఏప్రిల్ నెలలో విడుదలవుతుందని.. ఎన్నో అసలు పెట్టుకున్నారు. అయితే వారి అంచనాల పై చివరికి నీళ్ళు జల్లినట్టయ్యింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus