కౌబాయ్ సినిమాలు, బాండ్ స్టైల్ సినిమాలు అంటే సూపర్ స్టార్ కృష్ణ ఫేమస్. డేరింగ్ అండ్ డాషింగ్ సినిమాలు తీయడంలో ఆయన దిట్ట. అయితే ఆయన నట వారసుడిగా వచ్చిన మహేష్‌బాబు నుండి అలాంటి సినిమా రావడం లేదు. వచ్చిన ఒక్కగానొక్క కౌబాయ్ సినిమా ‘టక్కరి దొంగ’ దారుణ పరాజయాన్ని మూటగట్టుకొంది. దీంతో కృష్ణ ఫేమస్ పాత్రలు మహేష్ చేస్తే చూద్దాం అనుకున్నవారి కోరిక కోరికగానే మిగిలిపోతూ వస్తోంది. అయితే రాజమౌళి వల్ల ఈ పని కుదురుతోంది అంటున్నారు.
బాండ్.. జేమ్స్ బాండ్, ఈ పాత్ర మహేష్‌బాబుకు బాగా సూట్ అవుతుంందని అందరూ చెబుతుంటారు. ఆయన తండ్రి కృష్ణ కూడా ఇదే మాట గతంలో అన్నారు. మహేష్.. బాండ్‌గా కనిపిస్తే బాగుంటుందని ఆయన ఓ సందర్భంలో చెప్పినట్లు గుర్తు. ఇన్నాళ్లకు ఆ కోరిక రాజమౌళి సినిమాతో నెరవేరుతుందని అంటున్నారు. అవును రాజమౌళి – మహేష్‌బాబు సినిమా కథ జేమ్స్ బాండ్ స్టైల్‌లో ఉంటుందట. ప్రస్తుతం సోషల్ మీడియాలో, టాలీవుడ్ వర్గాల్లో ఇదే చర్చ.
నిజానికి ఏడాది క్రితమే బాండ్ సినిమా పుకారు బయటికొచ్చింది. అయితే ఆ తర్వాత మళ్లీ కామ్ అయిపోయింది. అయితే తాజాగా మహేష్ కోసం విజయేంద్ర ప్రసాద్ బాండ్ స్టైల్ కథ సిద్ధం చేశారు అని చెబుతున్నారు. అడవి నేపథ్యంలో సినిమా ఉంటుందని ఆ మధ్య వార్తలొచ్చినా… మళ్లీ బాండ్ అని అంటున్నారు. ఇందులో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ, మహేష్‌బాబును బాండ్‌గా చూపిస్తే మాత్రం మన టాలీవుడ్ సినిమా ప్రపంచఖ్యాతిని గాంచడం ఖాయం.
బాండ్ సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా పేరుంది. అయితే దానికంటూ సిరీస్ రన్ అవుతోంది. కాబట్టి ఇక్కడ రాజమౌళి తీసే సినిమా బాండ్ స్టైల్‌లో ఉంటుంది తప్ప, బాండ్ సినిమా అయ్యే అవకాశం లేదు. ఒకవేళ ఒరిజినల్ బాండ్ సినిమా చేయాలంటే దానికి ఏళ్ల తరబడి టైమ్ ఇచ్చేయాలి. చాలా త్యాగాలు చేయాలి. కాబట్టి మహేష్‌ను బాండ్ స్టయిల్‌లో మాత్రమే చూడగలం. అంటే రాజమౌళి స్టైల్ బాండ్ అన్నమాట. ఈ సినిమాకు సుమారు రూ. 800 కోట్ల బడ్జెట్ అంటున్నారు.
ఇందులో నిజానిజాలు పక్కనపెడితే.. అంత బడ్జెట్ అంటే చాలా కష్టం. మన భారతీయ సినిమా స్టామినా తెలుసు కానీ, అంత పందెం రిస్క్ చేసేదే అనే మాటలూ వినిపిస్తున్నాయి. రాజమౌళి – మహేష్ సత్తా తెలిసినప్పటికీ ఇబ్బంది పెట్టేదే అనిపిస్తోంది. ఇంగ్లిష్‌లోనూ సినిమా విడుదల చేస్తే ఇంకాస్త వసూళ్లు వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. మహేష్ ఎలాగూ ఇంగ్లిష్ హీరో మెటీరియల్ కాబట్టి ఆ ముచ్చట కూడా తీరిపోతుంది.
Most Recommended Video
‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?