టాలీవుడ్ లో టాప్ క్రేజ్ ఉన్న హీరో ప్రిన్స్ మహేష్ బాబు, అదే క్రమంలో అటు తమిళంలోనే కాకుండా, ఇతర బాషల్లోనూ, ఇంకా చెప్పాలి అంటే ఇతర దేశాల్లోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో ఎవరైనా ఉన్నారు అంటే ఆది కేవలం ఒక్క రజనీకాంత్ మాత్రమే. ఇక రాజని మానియా గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే…రాజని పాయ్ క్రేజ్ ఎంత ఉంది అంటే…రజనీకాంత్ తాజా చిత్రం కబాలి త్వరలో విడుదల కానున్న సంధర్భంగా ఈసినిమా విడుదల అయిన రోజున చెన్నైలోని చాల ప్రయివేటు కంపెనీలు తమ ఉద్యోగస్తులకు సెలవు ఇవ్వడమే కాకుండా చెన్నై కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న డేటా ప్రొసెసింగ్ కంపెనీ ‘ఫైండస్’ ఈనెల 22న తమ కంపెనీ ఉద్యోగులకు లీవ్ డిక్లేర్ చేసి ఈసినిమాకు సంబంధించిన టిక్కెట్లు కూడ ఇస్తుంది.
అది రజని స్టామినా…మరి అలాంటి రాజని ప్రిన్స్ ను అందుకోలేకపోయాడు అన్న వార్త వింటే ఎవరైకైనా వింత గానే అనిపిస్తుంది కానీ అది నిజం…విషయం ఏంటంటే…జపాన్ సింగపూర్ మలేషియా లాంటి ఎన్నో దేశాలలో ఎంతో మంది అభిమానులు ఉన్న రజినీకాంత్ అమెరికాకు సంబంధించి మహేష్ బాబు రికార్డుల కంటే వెనకబడి ఉన్నాడు అన్నది అందరూ ఒప్పుకోవాల్సిన విషయం ఎందుకంటే…ఈమధ్య విడుదలైన ‘బ్రహ్మోత్సవం’ సినిమాను అమెరికా-కెనడా లకు సంబంధించి ఒక ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటార్ 13.5 కోట్లకు కొన్న విషయం తెలిసిందే.
అదే క్రమంలో ఈసినిమా ఘోరపరాజయం చెందినా మహేష్ మురగదాస్ ల లేటెస్ట్ మూవీకి కూడ అమెరికాలో ఇంకా సినిమా ప్రారంభం కాకుండానే ‘బ్రహ్మోత్సవం’ కు మించిన ఆఫర్లు వస్తున్నాయి అని ఇండస్ట్రీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం. అయితే ప్రపంచాన్ని షేక్ చేస్తున్న రజని మానియా…అమెరికాలో మాత్రం ప్రిన్స్ కన్నా వెనుకబడి ఉండడం విశేషం. ‘కబాలి’ అమెరికా-కెనడా హక్కులు కేవలం 8.5 కోట్లకు మాత్రమే పలకడం అందరికీ షాక్ గా మారింది. ఇక ఈ వార్త బయటకు రావడంతో ప్రిన్స్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.