మహేష్ బాబు సినిమా షెడ్యూల్ ఫిక్స్!

  • July 21, 2018 / 09:38 AM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు కొరటాల శివ దర్శకత్వంలో చేసిన భరత్ అనే నేను సినిమా సూపర్ హిట్ అయింది. దీని తర్వాత వంశీ పైడి పల్లి దర్శకత్వంలో మహేష్ నటిస్తున్నారు. ఈ మూవీ మొదటి షెడ్యూల్ ని డెహ్రా డూన్ లో విజయవంతంగా పూర్తి చేసుకుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, వైజయంతి మూవీస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం కోసం  డైరక్టర్, ప్రొడక్షన్ డిజైనర్ సునీల్ బాబు తో కలిసి న్యూ యార్క్ కి వెళ్లి అక్కడ అందమైన లొకేషన్స్ ని సెలక్ట్ చేశారు. కెమెరామెన్ కేయూ మోహనన్ కూడా ఆ లొకేషన్స్ ని ఓకే చేశారు. బాలీవుడ్ లో డాన్ వంటి అనేక సినిమాలు కెమెరామెన్ గా చేసారు. తొలిసారి తెలుగు చిత్రం చేస్తున్నారు. మొదటి షెడ్యూల్ అక్కడే ప్లాన్ చేయాలనీ అనుకున్నారు. కానీ చలికాలం మొదట్లో అయితే అక్కడ మరింత అందంగా ఉంటుందని గ్రహించి అక్టోబర్ లో షూటింగ్ ప్లాన్ చేశారు.

అప్పటిలోపున ఇక్కడ ఉన్న సన్నివేశాలను కంప్లీట్ చేయనున్నారు. రెండో షెడ్యూల్ ని గోవాలో త్వరలో మొదలు పెట్టనున్నారు. ఆ తర్వాత న్యూయార్క్ కి పయనం కానున్నారు. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ చిత్రంలో  మహేష్ ఫ్రెండ్ రోల్ ని అల్లరి నరేష్ పోషిస్తుండగా.. హీరోయిన్ గా డీజే బ్యూటీ పూజా హెగ్డే నటిస్తోంది. ఈ సినిమా ఉగాది కానుకగా ఏప్రిల్ 5 న థియేటర్లోకి రానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus