Samantha: సమంత ‘యశోద’ సినిమాలో మెయిన్ పాయింట్!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నటిస్తోన్న లేటెస్ట్ సినిమా ‘యశోద’. ఈ సినిమాను నవంబర్ 11న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తెలుగుతో పాటు మిగిలిన భాషల్లో కూడా సినిమా విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ ఆసక్తిని క్రియేట్ చేసింది. ఇక ఈరోజు సినిమా ట్రైలర్ ను విడుదల చేయనున్నారు. ట్రైలర్ లో సినిమాలో మెయిన్ పాయింట్ ను రివీల్ చేయనున్నారట. ఈ సినిమాలో సమంత గర్భవతిగా కనిపించనున్న సంగతి తెలిసిందే.

అయితే అది సరోగసీతో వచ్చిన గర్భం అట. సరోగసీ కాన్సెప్ట్ తో సినిమాను రూపొందించారు. ఆ విషయాన్ని ట్రైలర్ లో వెల్లడించనున్నారు. నిజానికి ఇలాంటి పాయింట్స్ ను ట్రైలర్ లో చెప్పరు కానీ ‘యశోద’ టీమ్ కంటెంట్ మీద చాలా కాన్ఫిడెన్స్ తో ఉందట. సరోగసీ కాన్సెప్ట్ మీద థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో సినిమాను రూపిందించారు. తెలుగులో సినిమా ట్రైలర్ ను విజయ్ దేవరకొండ రిలీజ్ చేయనున్నారు.

హరి, హరీష్ అనే ఇద్దరు దర్శకుడులు రూపొందించిన ఈ సినిమాలో సమంతతో పాటు వరలక్ష్మి శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావురమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్ ఇలా చాలా మంది నటులు కీలకపాత్రలు పోషించారు. మణిశర్మ ఈ సినిమాకి సంగీతం అందించారు. శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కించారు. అదే రేంజ్ లో బిజినెస్ కూడా జరిగినట్లు తెలుస్తోంది. టేబుల్ ప్రాఫిట్ తో సినిమాను అమ్మినట్లు తెలుస్తోంది.

నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో పెద్ద అమౌంట్ వచ్చినట్లు సమాచారం. ఈ సినిమాతో సమంతకు ఎలాంటి సక్సెస్ వస్తుందో చూడాలి. దీంతో పాటు అమ్మడు చేతిలో మరో మూడు, నాలుగు ప్రాజెక్ట్స్ ఉన్నాయి.

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus