Namrata: నమ్రతలో మార్పు వెనుక అసలు కారణమిదేనా?

తెలుగులో తక్కువ సినిమాలలో నటించిన నమ్రత మహేష్ బాబుతో వివాహం తర్వాత సినిమాలకు దూరంగా ఉన్నారనే సంగతి తెలిసిందే. మహేష్ నమ్రత కాంబినేషన్ లో మరో సినిమా వస్తే బాగుంటుందని అభిమానులు భావిస్తున్నా ఆ ఆశలు నెరవేరే అవకాశాలు అయితే కనిపించడం లేదు. నమ్రత దాదాపుగా సినిమాలకు గుడ్ బై చెప్పినట్టేనని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. అయితే మహేష్ సక్సెస్ వెనుక నమ్రత ఉన్నారని చాలామంది భావిస్తారు. అయితే ఒక విషయంలో నమ్రత చరణ్ భార్య ఉపాసనను ఫాలో అవుతున్నారని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

మెగా కోడలిని ఘట్టమనేని కోడలు థియేటర్లలో సినిమా చూసే విషయంలో ఫాలో కావడం గమనార్హం. ఈ మధ్య కాలంలో చరణ్ సినిమాలను థియేటర్లలో చూస్తూ ఆ సినిమాలపై తన అభిప్రాయాన్ని ఉపాసన సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారనే సంగతి తెలిసిందే. సర్కారు వారి పాట మూవీని ప్రేక్షకుల మధ్య చూసిన నమ్రత మహేష్ ఫ్యాన్స్ నుంచి సినిమా గురించి రెస్పాన్స్ ను కూడా తెలుసుకోవడానికి ఆమె ప్రయత్నం చేశారు.

సింగిల్ స్క్రీన్ థియేటర్ లో నమ్రత సర్కారు వారి పాట సినిమాను చూడటంతో మహేష్ బాబు ఫ్యాన్స్ సైతం ఆశ్చర్యానికి గురవుతున్నారు. మిక్స్ డ్ టాక్ తెచ్చుకున్న సినిమాకు ఈ విధంగా ప్రమోషన్స్ చేయడం ద్వారా సినిమాకు ప్లస్ అవుతుందని ఆమె భావిస్తున్నారు. మహేష్ మూవీ కోసం నమ్రత పడుతున్న కష్టాన్ని నెటిజన్లు సైతం ప్రశంసిస్తున్నారు. మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబో మూవీ సెట్ కావడం వెనుక కూడా నమ్రత ఉన్నారని ప్రచారం జరుగుతోంది.

జూన్ లో మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుండగా ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా పూజా హెగ్డే ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

మహేష్ బాబు 26 సినిమాలు.. మరియు వాటి బాక్సాఫీస్ కలెక్షన్లు..!
‘భద్ర’ టు ‘అఖండ’.. బోయపాటి డైరెక్ట్ చేసిన సినిమాల కలెక్షన్లు..!
‘దూకుడు’ టు ‘సర్కారు వారి పాట’.. ఓవర్సీస్ లో మహేష్ బాబు 1 మిలియన్ మూవీస్ లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus