Adipurush: ఆదిపురుష్ విషయంలో షాకింగ్ నిర్ణయాలు తీసుకున్న మేకర్స్.. ఏమైందంటే?

ప్రభాస్, ఓం రౌత్ కాంబినేషన్ లో తెర్కెక్కిన ఆదిపురుష్ సినిమా హిందీ ట్రైలర్ కు 63 మిలియన్ల వ్యూస్ రాగా తెలుగు ట్రైలర్ కు 24 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఈ సినిమా రిలీజ్ కు సరిగ్గా నెల రోజుల సమయం ఉంది. ఇప్పుడిప్పుడే ఈ సినిమాపై అంచనాలు పెరుగుతుండగా తాజాగా ఆదిపురుష్ మేకర్స్ సంచలన నిర్ణయాలు తీసుకోగా ఆ నిర్ణయాలు సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతుండటం గమనార్హం.

ట్రిబెకా ఫిలిం ఫెస్టివల్ లో ఆది పురుష్ ప్రీమియర్లు క్యాన్సిల్ అయ్యాయని వార్తలు జోరుగా ప్రచారంలోకి వస్తున్నాయి. అక్కడ ఈ సినిమాను ప్రదర్శిస్తే సినిమా విడుదలకు ముందే రివ్యూలు రావడంతో పాటు సినిమాపై ఆ రివ్యూల ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉన్న నేపథ్యంలో మేకర్స్ ఈ దిశగా షాకింగ్ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. అదే సమయంలో యూఎస్ ప్రీమియర్లు కూడా క్యాన్సిల్ కానున్నాయని తెలుస్తోంది.

ఆదిపురుష్ (Adipurush) సినిమాపై నెగిటివిటీని వీలైనంత తగ్గించే దిశగా మేకర్స్ అడుగులు వేస్తున్నారని తెలుస్తోంది. ఈ సినిమా నాన్ థియేట్రికల్ హక్కులు భారీ మొత్తానికి అమ్ముడయ్యాయని సమాచారం. ఆదిపురుష్ మూవీ రిలీజ్ సమయానికి ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ప్రభాస్ ఈ సినిమాపై స్పెషల్ కేర్ తీసుకుంటున్నారని తెలుస్తోంది.

కృతి సనన్, సైఫ్ అలీ ఖాన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో సంచలనాలు సృష్టిస్తుందో చూడాల్సి ఉంది. ప్రభాస్ ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమా విజయం సాధిస్తే చాలామంది టాలీవుడ్ హీరోలు సైతం ఓం రౌత్ డైరెక్షన్ లో పని చేసే అవకాశం ఉంది. ఆదిపురుష్ సినిమా 600 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతోందని తెలుస్తోంది.

కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!

భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus