అతిథి’ సినిమాలో మహేష్ బాబు తో అలాగే ‘గబ్బర్ సింగ్’ లో పవన్ కళ్యాణ్ తో స్టెప్పులేసి కెవ్వుకేక పెట్టించిన మలైకా అరోరా అందరికీ గుర్తుండే ఉంటుంది. 40 ఏళ్ల వయసు మీద పడినా ఈమె వన్నె తగ్గని అందంతో కుర్ర కారుని ఆకర్షిస్తూనే ఉంది. 1998లో ఆర్ఫాజ్ ఖాన్ వివాహం చేసుకున్నాక కూడా ఎన్నో ఐటెం సాంగ్స్ లో చిందులేసింది. ఇదిలా ఉండగా … వీరిద్దరికి కొన్ని మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకోవాలని డిసైడ్ అయ్యారు.
అనుకున్నట్టు గానే 2017 లో విడిపోయారు. వీరిద్దరికి ఓ కొడుకు కూడా ఉన్నాడు. అయినప్పటికీ వీరు విడిపోవాలని ఎలా డిసైడ్ అయ్యారు అనే వాటి పై తాజాగా కరీనా కపూర్ టాక్ షో కి గెస్ట్ గా వచ్చిన మలైకా చెప్పుకొచ్చింది. ఆమె మాట్లాడుతూ…”నేను విడాకులు తీసుకోవాలి అని డిసైడ్ అయిన టైములో చాలా మంది నన్ను తిట్టిపోశారు. ఇది సరైన నిర్ణయం కాదు మాకు సంబంధం లేదు అంటూ నన్ను నిందించారు. కానీ జీవితంలో కొన్ని నిర్ణయాలు తీసుకోకపోతే జీవన విధానాన్ని కష్టంగా మార్చేసే అవకాశం ఉంటుంది.
అవి అపనిందలు కూడా తీసుకొస్తాయి.ఇవన్నీ అలోచించే నేను అర్భాజ్ ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇక ఏ తల్లి అయినా పిల్లలకు ఆనందాన్ని పంచాలనే కోరుకుంటుంది. నా కొడుకు కూడా నిన్ను సంతోషంగా చూడాలనుకుంటున్నాను. దానికి నీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అదే చెయ్యి అని చెప్పాడు. అందరూ నన్ను వ్యతిరేకించినా … నా కొడుకు మాత్రం నాకు అండగా నిలిచాడు అంటూ చెప్పుకొచ్చింది మలైకా. ఇక ప్రస్తుతం తను..అర్జున్ కపూర్ తో అలాగే అర్భాజ్ ఇటాలియన్ మోడల్ జార్జియా ఆండ్రియానీతో రిలేషన్ షిప్ లో ఉన్నట్టు కూడా తెలిపింది.
Most Recommended Video
ఈ 17 ఏళ్లలో బన్నీ వదులుకున్న సినిమాలు ఇవే!
మన టాలీవుడ్ డైరెక్టర్స్ మరియు వారి భార్యలు!
సొంత మరదళ్ళను పెళ్లాడిన టాప్ స్టార్స్