సినీ పరిశ్రమని విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఈ మధ్య కాలంలో చూసుకుంటే అనారోగ్య సమస్యలతో కొందరు, వయసు సంబంధిత సమస్యలతో ఇంకొందరు మరణించారు.అంతేకాకుండా గుండెపోటుతో కూడా కొంతమంది మరణించడం జరిగింది. కన్నడ నటుడు నితిన్ గోపి కూడా గుండె పోటుతో, దర్శకుడు వెట్రిమారన్ అసిస్టెంట్ శరన్ రాజ్ రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. అటు తర్వాత క్యాన్సర్ తో మంగళ్ ధిల్లాన్ , యాక్సిడెంట్ వల్ల కొరియన్ నటి పార్క్ సూ రియాన్ కూడా మరణించడం జరిగింది. నిన్నటికి నిన్న కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ కూడా మరణించారు.
ఆ షాక్ నుండి ఇండస్ట్రీ ఇంకా కోలుకోకముందే మలయాళంలో సీనియర్ నటుడు పూజపుర రవి (83) కూడా మరణించడం జరిగింది. ఆదివారం నాడే ఈయన కూడా మరణించడం జరిగింది. కాకపోతే ఈ వార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పూజపుర రవి కళానిలయం నాటక బృందం ద్వారా రంగస్థల నటుడిగా ఎంట్రీ ఇచ్చారు. ఆ వెంటనే సినిమాల్లోకి అడుగు పెట్టారు. దాదాపు 800 కి పైగా సినిమాల్లో నటించారు ఈయన. టోవినో థామస్ నటించిన ‘గప్పీ’ మూవీ పూజపుర రవికి చివరి చిత్రం కావడం విశేషం.
కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన మరయూర్ లోని తన కుమార్తె ఇంట్లో ఉంటూ వచ్చారు. కానీ పరిస్థితి విషమించడంతో ఆదివారం నాడు మరణించారు. మంగళవారం నాడు అంత్యక్రియలు నిర్వహించబోతున్నారు.ఇక పూజపుర రవి మరణంతో మలయాళ సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి.