కేరళ బ్యాక్ డ్రాప్ ను ఆధారం చేసుకుని తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి. అందులో ‘ఏ మాయ చేసావే’ ‘ఖుషి'(2023 ) ‘నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్’ వంటి ఎన్నో సినిమాలు ఉన్నాయి. అయితే పక్క భాషల సినిమాల్లో హైదరాబాద్ వాతావరణాన్ని చూపించిన సినిమాలు రాలేదు. మొన్నామధ్య వచ్చిన సల్మాన్ ఖాన్ ‘కిసి క భాయ్ కిసి క జాన్’ వంటి సినిమాలో తెలంగాణ సంస్కృతిని చూపించి ఆకట్టుకున్నారు. అలాగే ‘లాల్ సింగ్ చడ్డా’ సినిమాలో కూడా గోదావరి నేపధ్యాన్ని చూపించారు.
ఆ సినిమాలు ఆడలేదు కానీ.. ఆడుంటే కనుక ఇంకా చాలా మంది బాలీవుడ్ ఫిలిం మేకర్స్ హైదరాబాద్ అలాగే తెలుగు రాష్ట్రాల నేపధ్యాన్ని ఆధారం చేసుకుని సినిమాలు చేసేవారు అని అంతా అనుకున్నారు. కానీ లేటెస్ట్ గా ఓ సినిమా వచ్చింది. అదే ‘ప్రేమలు’. ఇదొక మలయాళ సినిమా. హైదరాబాద్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో నల్సేన్ కె. గఫూర్, మమిత బైజు ప్రధాన పాత్రలు పోషించారు. గిరీష్ ఏడీ ఈ చిత్రానికి దర్శకుడు.
పెద్దగా చప్పుడు లేకుండా వచ్చిన ఈ సినిమా (Premalu) సైలెంట్ గా బాక్సాఫీస్ వద్ద రూ.26 కోట్లకి పైగా గ్రాస్ వసూళ్లను సాధించింది. ఇక దీని బడ్జెట్ ఎంతో తెలుసా? కేవలం 5 కోట్లు.అవును కేవలం రూ.5 కోట్ల బడ్జెట్ లో తీసిన ఈ సినిమా లిమిటెడ్ థియేటర్స్ లో రిలీజ్ అయినా ఇప్పటికీ హౌస్ ఫుల్ బోర్డులు పెడుతుంది. కంటెంట్ ఉంటే స్టార్ వాల్యూ అవసరం లేదు అనే విషయాన్ని ఈ సినిమా మరోసారి చాటిచెప్పింది.