Mahesh Babu, Rajamouli: పృథ్వీరాజ్ సుకుమారన్ తో పాటు అతను కూడా ఫైనల్ అయ్యాడా..?!

మహేష్ బాబు (Mahesh Babu) – రాజమౌళి (S. S. Rajamouli) సినిమా టాలీవుడ్ నెక్స్ట్ బిగ్ థింగ్. ‘బాహుబలి'(సిరీస్) (Baahubali) , ‘ఆర్.ఆర్.ఆర్’..ల (RRR) తర్వాత రాజమౌళి రేంజ్ అమాంతం పెరిగిపోయింది. విదేశాల్లో కూడా ఆయన సినిమాలు బాగా ఆడాయి. అందువల్ల రాజమౌళి సినిమాపై కూడా అక్కడి ప్రేక్షకుల దృష్టి పడింది. ఇక మహేష్ బాబుతో తన నెక్స్ట్ సినిమా అని ప్రకటించి ఇప్పటికే 2 ఏళ్ళు దాటింది. కానీ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇంకా ఇవ్వలేదు. సూపర్ స్టార్ కృష్ణ జయంతికి, మహేష్ బాబు బర్త్ డే..కి.. అతని సినిమాల అప్డేట్స్ వచ్చేవి.

Mahesh Babu, Rajamouli

కానీ ఇప్పుడు ఆ సెంటిమెంట్స్ బ్రేక్ అయ్యాయి. మహేష్ అండ్ టీం పూర్తిగా రాజమౌళికి సరెండర్ అయ్యారు. రాజమౌళి పర్మిషన్ ఇవ్వకుండా ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఎటువంటి అప్డేట్స్ ఇవ్వకూడదు అనే నిబంధన మహేష్ టీంకి ఉంది. అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఏదో ఒక గాసిప్ వినిపిస్తూనే ఉంది. ఇప్పటికే పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) ఈ ప్రాజెక్టులో భాగం అయినట్టు అంతా చెబుతున్నారు. మరోపక్క విక్రమ్ ని (Vikram) కూడా రాజమౌళి సంప్రదించినట్లు ప్రచారం జరిగింది.

విక్రమ్ మాత్రం ఈ విషయం పై స్పందించడానికి ఇష్టపడలేదు. మరోపక్క పృథ్వీరాజ్ సుకుమారన్ ఆల్మోస్ట్ ఫైనల్ అయిపోయినట్టు టాక్ గట్టిగా వినిపిస్తోంది. అతనితో పాటు మరో మలయాళ స్టార్ హీరో కూడా ఈ ప్రాజెక్టులో భాగమయ్యే అవకాశాలు ఉన్నాయట. అతను మరెవరో కాదు మోహన్ లాల్ (Mohan Lal) . అవును మోహన్ లాల్..తో కూడా రాజమౌళి సంప్రదింపులు జరిపాడట. అది విలన్ పాత్ర కోసమని సమాచారం. మోహన్ లాల్ అయితే ఈ ప్రాజెక్ట్ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టు మలయాళ మీడియా వర్గాలు చెబుతున్నాయి.

వరుస రికార్డ్స్ తో సత్తా చాటుతున్న ప్రభాస్.. ఎవరికీ సాధ్యం కాదుగా!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus