Malli Pelli Twitter Review: ‘మళ్ళీ పెళ్లి’ ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

నరేష్ గోల్డెన్ జూబ్లీ ప్రాజెక్ట్ గా ‘మళ్ళీ పెళ్లి’ రూపొందింది. పవిత్ర లోకేష్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి ఎం.ఎస్.రాజు దర్శకుడు. ‘విజయ కృష్ణ మూవీస్ బ్యానర్‌’ పై నరేష్ స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.అనన్య నాగళ్ళ, అన్నపూర్ణ,వనిత విజయ్ కుమార్ వంటి వారు ఈ మూవీలో కీలక పాత్ర పోషించారు. మే 26న అంటే మరికొన్ని గంటల్లో ఈ మూవీ విడుదల కానుంది. టీజర్, ట్రైలర్ వంటివి జనాల్లో ఆసక్తిని రేకెత్తించాయి.

ఎందుకంటే ఇది నరేష్ – పవిత్ర ల జీవితంలోని సంఘటనలు ఆధారం చేసుకుని తీసిన కథ అని ప్రోమోలు స్పష్టం చేశాయి. మరీ ముఖ్యంగా నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి పై రివేంజ్ తో తీసిన సినిమాలా కూడా అనిపిస్తుంది. ఆల్రెడీ కొన్ని చోట్ల ఈ చిత్రం షోలు పడ్డాయి. ఈ సినిమాని రిలీజ్ చేయకుండా నిలిపివేయాలి అని నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి కేసు వేసినా.. ఈ సినిమా విడుదలకు ఆటంకాలు ఎదురవ్వలేదు అని తెలుస్తుంది.

అయితే ఈ సినిమా (Malli Pelli) చూసిన ప్రేక్షకులు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఇది కంప్లీట్ గా నరేష్ – పవిత్ర ల రియల్ లైఫ్ ఇన్సిడెంట్లను ఆధారం చేసుకుని రూపొందించిన సినిమా అని అంటున్నారు. కానీ చాలా సన్నివేశాలు స్పూఫ్ ల మాదిరి అనిపించాయని, డైరెక్షన్ చాలా స్లోగా ఉంది అంటున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఇలాంటి స్లో నెరేషన్ ను తట్టుకునే అవకాశం లేదని అభిప్రాయపడుతున్నారు. మరి తెలుగు రాష్ట్రాల్లో మార్నింగ్ షోల తర్వాత టాక్ ఎలా ఉంటుందో చూడాలి.

బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!

అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus