Malvika Sharma: మాళవిక గొప్పమనసు కు ఫిదా అవుతున్న నెటిజన్లు

  • August 4, 2023 / 07:34 PM IST

మాములుగా హీరోయిన్లు అంటే కాలికి మట్టి అంటకుండా ఏసీ కార్లలో తిరుగుతారు. ఇక సినిమాలకు సంబంధించిన వేడుకల్లో వారి హడావిడి మాములుగా ఉండదు. అయితే వారిలో కూడా చాలా మంది సమాజం పట్ల, సామాన్య మనుషుల పట్ల ప్రేమతో సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. అందులో ఈ బొమ్మాయి హీరోయిన్ చేస్తున్న పనికి అందరు ఫిదా అవుతున్నారు. ఆమె ఎవరో కాదు మాళవికా శర్మ. తెలుగు సినిమాతో సినీ పరిశ్రమకు పరిచయమైన ముంబయి భామ నేల టిక్కెట్టుతో ప్రేక్షకులను పలకరించిన ఈ భామ ఇక్కడ మంచి పేరు సొంతం చేసుకున్నారు.

తాను చేసిన మంచి పనితో తన మనసేంటో రుజువు అయింది. ఆమె సొంతంగా పేద విద్యార్థులకు చెప్పులు దానం చేశారు. అంతేకాకుండా, ఆమే స్వయంగా చెప్పులను చిన్నారుల పాదాలకు తొడిగి అందరిని ఆశ్చర్యపరిచారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోను తన ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకున్నారు మాళవికా. రాజస్థాన్‌లోని దేవ్‌గఢ్‌లో ఉన్న దాదాపు 40 పాఠశాలలకు దేవ్‌ శ్రీ ఛారిటబుల్‌ ట్రస్ట్‌ సేవలు అందిస్తోంది.

అయితే ఆ ట్రస్ట్ ఆధ్వర్యంలో తాను అన్ని స్కూళ్లను సందర్శించి వారికి కావాల్సిన కనీస సదుపాయాలను తాను నోటీస్ చేసిందట. ముఖ్యంగా విద్యార్థులకు అవసరమైన కనీస అవసరం కాళ్లకు చెప్పులు అని వారందరికి వాటిని కొనుగోలు చేసింది. అలాగే వాటిని ఎంతో ప్రేమతో విద్యార్థుల కాళ్లకు తొడిగింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఆమె గొప్ప మనసును నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.

ఏప్రిల్‌ నెలలోనే మాళవిక (Malvika Sharma) పాఠశాలలను సందర్శించి సాయం చేసినప్పటికీ తాజాగా ఆమె ఈ వీడియోను షేర్‌ చేశారు. ఇక తెలుగులో తన చివరి సినిమా రామ్ పోతినేనితో నటించిన రెడ్. ఆ తరువాత తాను తెలుగులో ఏ సినిమాల్లో కనిపించలేదు. ఇక సమాజానికి ఉపయోగపనులు చేస్తూ, చిన్న చిన్న సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఇటీవల సినీ నటులు అందర ప్రశంసలు అందుకుంటున్నారు. ఇటీవల బాలీవుడ్ నటి అలియా భట్ ఓ వ్యక్తికి తన చేతితో చెప్పు అందించిన వార్తల్లోకెక్కింది.

ఆ హీరోయిన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ ‘బలగం’ తో పాటు చావు కాన్సెప్ట్ తో రూపొందిన 10 సినిమాల లిస్ట్..
హైప్ లేకుండా రిలీజ్ అయిన 10 పెద్ద సినిమాలు… ఎన్ని హిట్టు… ఎన్ని ప్లాప్?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus