సుధీర్ బాబు ట్రిపుల్ రోల్ ప్లే చేసిన లేటెస్ట్ మూవీ ‘మామా మశ్చీంద్ర’. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి బ్యానర్ పై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు.. లు నిర్మించిన ఈ చిత్రం టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను ఇంప్రెస్ చేశాయి. తెలుగు, హిందీ భాషల్లో రూపొందిన ఈ ద్విభాషా చిత్రాన్ని ‘సృష్టి సెల్యులాయిడ్’ సోనాలి నారంగ్, సృష్టి సమర్పకులుగా వ్యవహరించారు. అక్టోబర్ 6న ఈ సినిమా విడుదల కాబోతుంది.
హర్షవర్ధన్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. సుధీర్ బాబు గత సినిమాలు పెద్దగా ఆడలేదు. దీంతో ఈ సినిమాకి బిజినెస్ కూడా ఆశించిన స్థాయిలో జరగలేదు. ఒకసారి వాటి వివరాలు గమనిస్తే :
నైజాం
1.20 cr
సీడెడ్
0.40 cr
ఉత్తరాంధ్ర
0.60 cr
ఈస్ట్
0.18 cr
వెస్ట్
0.15 cr
గుంటూరు
0.20 cr
కృష్ణా
0.25 cr
నెల్లూరు
0.15 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
3.13 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా
0.10 cr
ఓవర్సీస్
0.15 cr
వరల్డ్ వైడ్ (టోటల్)
3.38 cr (షేర్)
‘మామా మశ్చీంద్ర’ (Mama Mascheendra) చిత్రానికి రూ.3.38 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.3.75 కోట్ల షేర్ ను రాబట్టాలి.పాజిటివ్ టాక్ కనుక వస్తే తప్ప బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు లేవు. మరి టార్గెట్ ను రీచ్ అవుతుందో లేదో చూడాలి