నటి గౌతమి ఇంట్లో అపరిచితుడు..!
- November 18, 2020 / 01:38 PM ISTByFilmy Focus
ప్రముఖ నటి గౌతమి ఇంట్లో ఓ దుండగుడు చొరబడడం కలకలం రేపింది. చెన్నైలోని కొట్టివక్కమ్‌లో నటి గౌతమి జీవిస్తున్నారు. ఆ ఇంట్లోకి అనుమతి లేకుండా ఓ వ్యక్తి ప్రవేశించాడు. ఇంట్లోని ఒక గోడ పక్కన దాక్కొని ఉన్న అతడిని గౌతమి ఇంట్లో పని చేసే వ్యక్తి గమనించాడు. వెంటనే అతడు పోలీసులకు సమాచారం అందించాడు. కాసేపటికి గౌతమి ఇంటికి చేరుకున్న నీలంకరై పోలీసులు అతడిని అరెస్ట్ చేశాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు అతడు కొట్టివాక్కం కుప్పంకు చెందిన పాండియన్ (28)గా గుర్తించారు. అతడు మద్యం మత్తులో ఉన్నాడని పోలీసులు తెలిపారు. అనుమతి లేకుండా గౌతమి ఇంట్లోకి ప్రవేశించడంతో పాటు ఆందోళన కలిగించినందుకు గాను అతడిపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఆ తరువాత పాండియన్ బెయిల్ పై బయటకి వచ్చేశాడు. గౌతమి ఇంటి పరిసర ప్రాంతాల్లో పాండియన్ సోదరుడు పని చేస్తున్నాడని..

అతడిని కలవడానికే పాండియన్ అక్కడకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఇక కెరీర్ విషయానికొస్తే.. అప్పుడప్పుడు తన వయసుకి తగ్గ పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తోంది గౌతమి. ప్రస్తుతం తమిళంలో ‘తుప్పరివాళన్ 2’ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.
Most Recommended Video
ఆకాశం నీ హద్దు రా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 4’ లో ఎవరి పారితోషికం ఎంత.. ఎక్కువ ఎవరికి..?
50 కి దగ్గరవుతున్నా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్ల లిస్ట్..!














