మెగాస్టార్ చిరంజీవి 70వ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా చిరంజీవి నెక్స్ట్ సినిమాలకి సంబంధించిన అప్డేట్స్ ను వదులుతూ వస్తున్నారు మేకర్స్. ఆల్రెడీ నిన్న ‘విశ్వంభర’ గ్లింప్స్ వదిలారు. కొద్దిసేపటి క్రితం దర్శకుడు అనిల్ రావిపూడితో చిరు చేస్తున్న సినిమాకు సంబంధించిన టైటిల్ గ్లింప్స్ ను కూడా వదిలారు.ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తుంది.
59 సెకన్లు నిడివి కలిగిన ఈ గ్లింప్స్ లో.. మెగాస్టార్ చిరంజీవి సూటు బూటు వేసుకుని స్టైల్ గా కారులో నుండి దిగుతూ రావడం. అతని వెనుక బాడీగార్డ్స్ ఉన్నారు. సిగరెట్ కాలుస్తూ స్టైల్ గా తన స్వాగ్ చూపిస్తూ వచ్చారు చిరు. చివర్లో సిగరెట్ అలా విసిరేయగా టైటిల్ కార్డు పడింది. మళ్ళీ దాని తర్వాత గుర్రాన్ని పట్టుకుని స్టైల్ గా సిగరెట్ కాలుస్తూ నడుచుకుంటూ వచ్చారు చిరు. ఇక భీమ్స్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ‘రౌడీ అల్లుడు’ రిఫరెన్స్ తో ఉంది.
చిరు మేనరిజమ్స్ అన్నీ మనకు ‘రౌడీ అల్లుడు’ రోజులను గుర్తు చేసే విధంగా ఉన్నాయి. దీనికి వెంకటేష్ వాయిస్ ఓవర్ కూడా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. మొత్తంగా దర్శకుడు అనిల్ రావిపూడి చిరంజీవి అభిమానులతో పాటు.. తనకు బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అయిన ఫ్యామిలీ ఆడియన్స్ ని కూడా టార్గెట్ చేసే విధంగా ఈ టైటిల్ గ్లింప్స్ ను డిజైన్ చేశాడు. మీరు కూడా ఓ లుక్కేయండి :