పాపం.. ఆ యువ హీరో మళ్ళీ మొదటి నుండి స్టార్ట్ చేయాల్సిందే..!

హీరోలైనా, హీరోయిన్లు అయినా కొంత గుర్తింపు సంపాదించుకున్న తర్వాత మేనేజర్ల అవసరం పడుతుంది. వాళ్ళ మార్కెట్ ను, డిమాండ్ ను దృష్టిలో పెట్టుకుని.. సరైన ప్లానింగ్ తో ముందుకు తీసుకువెళ్లేది మేనేజర్లే. హీరోలు (Hero), హీరోయిన్ల కెరీర్ ను ముందుకు తీసుకువెళ్లడంలో మేనేజర్ల పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. ఒకవేళ వాళ్ళు కనుక కరెక్ట్ గా లేకుండా.. కక్కుర్తిగా వ్యవహరిస్తే.. హీరోలు, హీరోయిన్ల కెరీర్ల డౌన్ ఫాల్ కూడా స్టార్ట్ అవుతుంది.

Hero

చాలా మంది స్టార్ హీరోయిన్లు మేనేజర్ల వల్ల.. కెరీర్ ను నాశనం చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. నటీనటులు కూడా ‘వాళ్ళకి ఎలాంటి రోల్స్ కావాలి, ఎలాంటి రోల్స్ వాళ్ళకి సరిపోతాయి? ఎవరు ఎంత కరెక్ట్ గా ఉంటారు?’ అనేది అంచనా వేసుకోకుండా.. ఆల్రెడీ కొంత పేరుంటే చాలు.. మనకి అది కలిసొచ్చేస్తుంది అని భావించి.. వాళ్ళ ‘కీ’ అంతటినీ తీసుకెళ్లి మేనేజర్ల చేతిలో పెట్టేస్తారు.తర్వాత తెలీకుండానే వాళ్ళ చేతిలో కీలుబొమ్మలు అయిపోతారు.

ఇప్పుడు కూడా అలాంటి సంఘటన గురించి ఒకటి చెప్పుకుందాం. ఓ యువ హీరో కెరీర్ తన మేనేజర్ వల్ల చాలా దెబ్బతిందట. విషయం ఏంటంటే.. కెరీర్ ప్రారంభంలో చిన్న చితకా పాత్రలు, విలన్ రోల్స్ వంటివి చేశాడు ఆ యువ హీరో. అతనికి ఓ హర్రర్ సినిమా బ్రేక్ ఇచ్చింది. థియేటర్ ఆర్టిస్ట్ కావడంతో అతనిపై నిర్మాతలు కూడా పెట్టుబడులు పెట్టి సినిమాలు చేయడానికి రెడీ అయ్యారు. దీంతో ఒక పెద్ద హీరో, దర్శకుడికి పీఆర్ గా చేసే వ్యక్తిని మేనేజర్ గా పెట్టుకున్నాడు ఆ యువ హీరో.

అయితే ఈ యువ హీరో (Hero)  ఒక్కో సినిమాకి రూ.40 లక్షలు వచ్చేలా చూడమంటే.. ఆ మేనేజర్ బయటకు రూ.60 లక్షల నుండి రూ.80 లక్షలు చెప్పాడట. మరోపక్క అతనికి ఓ పెద్ద ప్రొడక్షన్ నుండి కాల్ వచ్చింది. అడ్వాన్స్ తీసుకోవడానికి రమ్మని చెప్పింది. దీంతో ఆ యువ హీరో తన మేనేజర్ కి వెళ్లి ఆ పెద్ద ప్రొడక్షన్ హౌస్ వారు ఇచ్చే చెక్ తీసుకుని రమ్మని చెప్పాడట. కానీ సదరు మేనేజర్ వెళ్ళలేదు.

దీంతో ఆ ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు ఆ చెక్ ను ఇవ్వొద్దు అని చెప్పారట. ఇలాంటి ఆఫర్స్ ఎన్నో మేనేజర్ వల్ల పోగొట్టుకున్నాడు ఆ యువ హీరో (Hero) . అందుకే ఆ మేనేజర్ ను తీసి పారేశాడట. అలా అని ఆ మేనేజర్ కి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. ముందుగా జాగ్రత్త పడి ఉంటే అతని కెరీర్ బాగా సాగేది. ఇప్పుడు ఆ యువ హీరోని నిర్మాతలు కూడా సరిగ్గా పట్టించుకోవడం లేదు. ఇప్పుడు సరైన ప్లానింగ్ వేసుకోవాలని భావిస్తున్నాడట.

తారక్‌ – నీల్‌ సినిమానీ ‘డబుల్‌’ క్యాష్‌ చేసుకుంటారా? ప్లాన్‌ అదేనా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus