శర్వానంద్ (Sharwanand) 35వ చిత్రంగా ‘మనమే’ (Manamey) రూపొందింది. ఈరోజు అనగా జూన్ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి శ్రీరామ్ ఆదిత్య (Sriram Aditya) దర్శకుడు. ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ సంస్థ పై టి.జి.విశ్వ ప్రసాద్ (T. G. Vishwa Prasad) నిర్మించిన ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల (Vivek Kuchibhotla) సహా నిర్మాత. అలాగే విశ్వప్రసాద్ కూతురు కృతి ప్రసాద్ ‘క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా’ ఈ చిత్రంతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.కృతి శెట్టి (Krithi Shetty) హీరోయిన్ గా నటించింది. ‘మనమే’ టీజర్, ట్రైలర్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.
ప్రామిసింగ్ గా కూడా ఉన్నాయి. దీంతో థియేట్రికల్ బిజినెస్ బాగానే జరిగింది అని చెప్పాలి. ఒకసారి వాటి వివరాలు గమనిస్తే :
నైజాం | 4.00 cr |
సీడెడ్ | 1.80 cr |
ఆంధ్ర(టోటల్) | 5.20 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 11.00 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 1.00 cr |
ఓవర్సీస్ | 0.80 cr |
వరల్డ్ వైడ్(టోటల్) | 12.80 cr |
‘మనమే’ చిత్రానికి రూ.12.8 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం రూ.13 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. పాజిటివ్ టాక్ కనుక వస్తే బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్సులు పుష్కలంగా ఉన్నాయి. శర్వానంద్ కి ఆ రేంజ్ బాక్సాఫీస్ స్టామినా కూడా ఉంది. ‘శతమానం భవతి’ (Shatamanam Bhavati) ‘మహానుభావుడు’ (Mahanubhavudu) వంటి సినిమాలు రూ.20 కోట్లు, రూ.30 కోట్లు కలెక్ట్ చేసిన సంగతి తెలిసిందే.