శర్వానంద్ హీరోగా శ్రీరామ్ ఆదిత్య డైరెక్షన్ లో తెరకెక్కిన మనమే సినిమాపై ఒకింత భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. తాజాగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ క్లాస్ ప్రేక్షకులను మెప్పించేలా ఉంది. సినిమా ష్యూర్ షాట్ హిట్ అవుతుందనే నమ్మకాన్ని కలిగించడంలో మనమే టీమ్ సక్సెస్ అయిందనే చెప్పాలి. ఈ నెల 7వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుండగా ఈ నెల 5న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది.
అయితే పిఠాపురంలో మనమే ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుండగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ వేడుకకు గెస్ట్ గా హాజరు కానున్నారు. ఈ నెల 4వ తేదీన ఏపీ ఎన్నికల ఫలితాలు వెలువడనుండగా పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో గెలుస్తారని ఎగ్జిట్ పోల్స్ సర్వేల ఫలితాలు చెబుతున్నాయి. పవన్ గెలుపు తర్వాత పిఠాపురంలో జరిగే ఈవెంట్ కు చరణ్ గెస్ట్ గా హాజరైతే ఆ ఈవెంట్ ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు.
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు ఈ ఈవెంట్ స్పెషల్ ఈవెంట్ అవుతుందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పిఠాపురంలో ఈవెంట్ చేయడం వల్ల పవన్ ఫ్యాన్స్ సైతం మనమే సినిమాపై దృష్టి పెట్టే అవకాశాలు ఉన్నాయి. పవన్ ను పిఠాపురం ఎమ్మెల్యేగా చూడాలన్న పవన్ ఫ్యాన్స్ కోరిక సైతం నెరవేరనుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఎలక్షన్ కోడ్ వల్ల ఈ మధ్య కాలంలో సినిమాల ఈవెంట్లకు సంబంధించి అనుమతుల విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అయితే ఎలక్షన్ కోడ్ ఈ నెల 4తో ముగియనున్న నేపథ్యంలో మనమే ఈవెంట్ కు ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పవచ్చు.
పీపుల్స్ మీడియా బ్యానర్ నిర్మాతలు మనమే సినిమాకు సంబంధించి ఖర్చు విషయంలో ఏ మాత్రం రాజీ పడలేదని తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో ఈ బ్యానర్ కు చాలా సినిమాలు కమర్షియల్ గా నష్టాలను మిగిల్చిన నేపథ్యంలో మనమే సినిమా కచ్చితంగా హిట్ కావాల్సి ఉంది. మనమే సినిమాకు హిట్ టాక్ వస్తే కల్కి సినిమా విడుదలయ్యే వరకు కలెక్షన్ల పరంగా ఢోకా ఉండదు. శ్రీరామ్ ఆదిత్య అతని టీమ్ ఈ సినిమా కోసం ఎంతో కష్టపడినట్లు తెలుస్తోంది.