Manasantha Nuvve: ‘మనసంతా నువ్వే’ చైల్డ్ ఆర్టిస్ట్ గ్లామర్ ఫోటోలు వైరల్!
- November 20, 2024 / 02:17 PM ISTByFilmy Focus
ఉదయ్ కిరణ్ (Uday Kiran), రీమాసేన్ (Reema Sen) కాంబినేషన్లో ‘చిత్రం’ వంటి సూపర్ హిట్ మూవీ తర్వాత వచ్చిన ఇంకో బ్లాక్ బస్టర్ మూవీ ‘మనసంతా నువ్వే’ (Manasantha Nuvve) . ‘సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్’ బ్యానర్ పై ఎం.ఎస్.రాజు (M. S. Raju) నిర్మించిన ఈ చిత్రానికి వి.ఎన్.ఆదిత్య (V. N. Aditya) దర్శకుడు. ఈ సినిమాలో (Manasantha Nuvve) చిన్నప్పటి హీరోయిన్ గా నటించిన పాప అందరికీ గుర్తుండే ఉంటుంది. ‘తూనీగ తూనీగ .. ఎందాక పరిగెడతావే రావే నా వంకా..’ అంటూ అందరి మదిలో ఇంకా మెదులుతూనే ఉంటుంది.
Manasantha Nuvve

ఆమె మరెవరో కాదు సుహాని కలిత (Suhani Kalita) . చైల్డ్ ఆర్టిస్ట్‌గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈమె ‘మనసంతా నువ్వే’ తో పాటు.. ‘బాల రామాయణం’, ‘గణేష్'(1998) (Ganesh) , ‘ప్రేమంటే ఇదేరా’ (Premante Idera) , ‘ఎదురులేని మనిషి’ (Eduruleni Manishi), ‘ఎలా చెప్పను’ (Ela Cheppanu) , ‘ఆనందమానందమాయే’ వంటి సినిమాల్లో నటించింది. అలాగే తర్వాత హీరోయిన్ గా మారి ‘కృషి’ ‘సవాల్’ ‘స్నేహ గీతం’ (Sneha Geetham) వంటి సినిమాల్లో కూడా నటించింది. అయితే హీరోయిన్ గా ఈమె అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేదు. విభర్ హసీజాను అనే వ్యక్తిని 2022 అక్టోబర్లో పెళ్లి చేసుకుంది.

పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న ఈమె ట్రావెల్ ఇన్ఫ్లుయెన్సర్ గా మారి వీడియోలు చేస్తుంది. అలాగే తన భర్తతో తీసుకున్న రొమాంటిక్ ఫోటోలు కూడా షేర్ చేస్తూ ఉంటుంది. ఈమె భర్త విభర్ హసీజాను ప్రముఖ సంగీత కళాకారుడు.. అలాగే మోటివేషనల్ స్పీకర్ అనే సంగతి తెలిసిందే. ఇతను విదేశాల్లో సెటిల్ అయ్యాడు. పెళ్లి తర్వాత సుహాని కలిత కూడా విదేశాల్లో ఉంటుంది. ఆమె లేటెస్ట్ గ్లామర్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :













