Suhani Kalita: ఘనంగా ‘మనసంతా నువ్వే’ చైల్డ్ ఆర్టిస్ట్ సుహాని పెళ్లి.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

Advertisement

ఉదయ్ కిరణ్, రీమాసేన్ జంటగా వి.ఎన్.ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కిన ‘మనసంతా నువ్వే’ చిత్రం ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో అందరికీ తెలుసు. ఎం.ఎస్.రాజు నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సునీల్, తనూరాయ్ కూడా ముఖ్య పాత్రలు పోషించారు. ఆర్.పి.పట్నాయక్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలన్నీ చార్ట్ బస్టర్స్ అయ్యాయి. అందులో ‘తూనీగా తూనీగా.. ఎందాక పరిగెడతావే రావే నా వంకా..’ అనే పాట ఇప్పటి జనరేషన్ కిడ్స్ ను కూడా అలరిస్తూనే ఉంది.

ఇదిలా ఉండగా.. ఈ పాటలో ఆడిపాడిన చిన్నారి అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈమె పేరు సుహాని కలిత. చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా ‘మనసంతా నువ్వే’ తో పాటు.. ఎన్టీఆర్ నటించిన ‘బాల రామాయణం’, వెంకటేష్ నటించిన ‘గణేష్’, ‘ప్రేమంటే ఇదేరా’, నాగార్జున నటించిన ‘ఎదురులేని మనిషి’, తరుణ్ నటించిన ‘ఎలా చెప్పను’, ఆకాష్ నటించిన ‘ఆనందమానందమాయే’ వంటి చిత్రాల్లో నటించింది. హీరోయిన్ గా కూడా ‘సవాల్’ ‘కృషి’ ‘స్నేహ గీతం’ అనే చిత్రంలో చేసింది.

ఇంకా కొన్ని తమిళ చిత్రాల్లో హీరోయిన్ గా చేసింది కానీ అవేమి ఈమెకు గుర్తింపు తెచ్చిపెట్టలేకపోయాయి. ఆ తర్వాత ఆమెకు అవకాశాలు కూడా కరువవడంతో పెళ్ళికి రెడీ అయిపోయింది. సంగీత కళాకారుడు, మోటివేషనల్‌ స్పీకర్‌ అయిన విభర్‌ హసీజానుతో ఈమె నిశ్చితార్థం జూన్ 3న ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే.

అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక వీరి వివాహం ఈ మధ్యనే ఘనంగా జరిగినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం సుహాని, విభోర్ పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus