Manchu Lakshmi: కామెంట్‌ చేసిన వాడిని మాటలతో మడతెట్టేసిన మంచు లక్ష్మి.. ఏమైందంటే?

టాలీవుడ్‌లో ఫైర్‌ బ్రాండ్‌లు అంటే తొలుతగా గుర్తొచ్చే పేరు మంచు లక్ష్మి. ఇటీవల కాలంలో ఆమె కాస్త కామ్‌గా ఉంటున్నారు కానీ.. ఒకప్పుడు చాలా స్ట్రాంగ్‌ రిప్లైలు ఇచ్చేవారు. ఎక్కడున్నాం, ఏం చేస్తున్నాం, చుట్టూ ఎవరున్నారు లాంటివి పట్టించుకోకుండా తాను అనాల్సినవి, చెప్పాల్సినవి కచ్చితంగా ష్యూర్‌ షాట్‌గా చెప్పేసేవారు. చాలా రోజుల తర్వాత ఇప్పుడు మంచు లక్ష్మి ఓ అభిమాని / వ్యక్తి మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతకీ ఏమైందంటే?

Manchu Lakshmi

దుబాయ్ వేదికగా ఇటీవల జరిగిన సైమా వేడుకలు మంచు లక్ష్మి ఓ అతిథిగా హాజరయ్యారు. ఈ క్రమంలో ఆమెతో సెల్ఫీలు దిగేందుకు ఫ్యాన్స్ పోటీ పడ్డారు. ఈ క్రమంలో వెనుక నుండి ఎవరో ఒకరు అసభ్యంగా కామెంట్ చేశారు. దీంతో మంచు లక్ష్మీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒరేయ్ నా ముందొచ్చి మాట్లాడురా ఎవడో ఆడు. టైం, సెన్స్ లేదు రాస్కెల్స్ అని ఘాటుగా రిప్లై ఇచ్చారు. ఆ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఆ తర్వాత అక్కడి వారితో సెల్ఫీ దిగుతూ సరదాగా జోకులేశారు.

అయితే, అంతలా రియాక్ట్‌ అవ్వాల్సిన అవసరం ఏముంది కొందరు కామెంట్లు చేస్తుండగా.. అలాంటి వాళ్లకు అలానే రియాక్ట్‌ అవ్వాలి అని మరికొందు కామెంట్లు చేస్తున్నారు. ఏదైతేనేందీంతో మా ఫైర్‌ బ్రాండ్‌ మంచు లక్ష్మి ఈజ్‌ బ్యాక్‌ అంటూ అభిమానులు, నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఇక సినిమాల సంగతి చూస్తే గతేడాది ‘ఆదిపర్వం’ సినిమాతో మంచు లక్ష్మి ప్రేక్షకుల ముందుకొచ్చారు. అలాగే యక్షణి వెబ్‌ సిరీస్‌లోనూ కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం ‘దక్ష’ అనే సినిమాలో నటించారు. ఈ నెల 19న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు తన ఛారిటీ షోలు, కార్యక్రమాలతోనూ మంచు లక్ష్మి బిజీగా ఉన్నారు. వివిధ కారణాల వల్ల ఆమె ముంబయికి మకాం మార్చి అక్కడే ఉంటున్న విషయం తెలిసిందే.

ఇంటర్నేషనల్‌ వేదికపై అన్ని హాలీవుడ్‌ సినిమాలో మధ్యలో మన సినిమా!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus