Manchu Lakshmi: నలుగురు పిల్లలను కనాలనుకున్నాను!

మంచు మోహన్ బాబు వరసరాలుగా ఇండస్ట్రీలోకి వచ్చినటువంటి లక్ష్మీ ప్రసన్న ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నారు. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె మంచు మనోజ్ భూమా మౌనిక వివాహం గురించి కొన్ని విషయాలు తెలియజేశారు. సాధారణంగా ప్రేమించుకున్న వారు పెళ్లి వరకు వెళ్లడం అంటే ఓ పెద్ద టాస్క్ అని చెప్పాలి కానీ మౌనిక మనోజ్ విషయంలో ఇది మరింత టఫ్ గా మారిందని ఈమె తెలిపారు.

భూమా మౌనిక ఫ్యామిలీకి మంచు ఫ్యామిలీకి గత దశాబ్దన్నర కాలంగా పరిచయం ఉంది. ఈ క్రమంలోనే మనోస్ మౌనికలు నాలుగు సంవత్సరాలుగా ప్రేమించుకున్నారు అయితే వీరి ప్రేమ విషయాన్ని ఇంట్లో చెప్పడంతో మొదట్లో తిరస్కరించిన వారిని ఒప్పించడానికి నాలుగు సంవత్సరాల సమయం పట్టింది.ఇక ఈ విషయం గురించి లక్ష్మీ మాట్లాడుతూ మనోజ్ మౌనిక పెళ్లి విషయంలో అందరికంటే నేను ఎక్కువగా టెన్షన్ పడ్డాను వీరి పెళ్లికి నాన్న ఒప్పుకోలేదు.

అయితే ఓసారి యాదాద్రి వచ్చినప్పుడు వీరి పెళ్లికి ఎలాగైనా నాన్నను ఒప్పించు దేవుడా నాకు చేతకాలేదని ప్రార్థించాను.ఆయన నా ప్రార్ధన విన్నట్టు ఉన్నారు. వీరిద్దరికీ పెళ్లి చేశారు. అందుకే ఇద్దరిని తీసుకొని యాదాద్రికి వెళ్లి వచ్చానని లక్ష్మీ ప్రసన్న తెలిపారు. ఇలా వీరు పెళ్లికి నాన్న త్వరగా ఒప్పుకోకపోవడానికి కారణం ఉంది రెండు కుటుంబాలకు చరిత్రలు ఉన్నాయి. అలాంటిది వీరిద్దరూ నిజంగానే పెళ్లి చేసుకోవాలనుకున్నారా అన్న సందేహం వారికుందని తెలిపారు. జీవితంలో ప్రేమ ఒక్కటే నిజమని వారిద్దరు ప్రేమించుకుంటే మనకేంటి సమస్య వీలైతే ఆశీర్వదించాలి.

ఎలాగైతేనేమి వారిద్దరి పెళ్లి జరిగిందని మంచు లక్ష్మి (Manchu Lakshmi) తెలిపారు. ఇక మనోజ్ నాకు ఏ చిన్న సహాయం కావాలన్నా చేయడానికి ముందుంటారని లక్ష్మి ప్రసన్న తెలిపారు. ఇక పెళ్లికి ముందు ఇద్దరు కూడా మా ఇంట్లోనే నాతో పాటే ఉన్నారని ఇప్పుడు వేరుగా ఉన్నారని లక్ష్మీప్రసన్న తెలిపారు.ఇక తన పిల్లల గురించి మాట్లాడుతూ తను నలుగురు పిల్లల్ని కనాలనుకున్నాను. కానీ భగవంతుడు నాకు ఒకరినే ఇచ్చారని తెలిపారు.ఇక రాజకీయాల గురించి ప్రశ్న ఎదురవడంతో తనకు రాజకీయాలంటేనే ఆసక్తి లేదని ఈమె సమాధానం చెప్పారు.

రంగబలి సినిమా రివ్యూ & రేటింగ్!

రుద్రంగి సినిమా రివ్యూ & రేటింగ్!
18 స్టార్ హీరోయిన్ల చిన్ననాటి రేర్‌ ఫోటోలు వైరల్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus