“మీ కోసం” మేము సైతం

ఒక ఆలోచన ఎన్నో జీవితాల్లో వెలుగు నింపనుంది…
ఒక ఆలోచన ఎంతో మందికి అండగా నిలవనుంది…
ఒక మాట పేదవళ్ళ జీవితాల్లో భరోసా ఇవ్వనుంది…
ఒక మాట మీకోసం మేమున్నాం అంటూ బంగారు భవిష్యత్తుపై ఆశ కల్పించనుంది…!

నిస్సహాయుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు… కల్మషం లేని మనుషుల మనసుల్లో ఆనంద హరివిల్లులను పూయించేందుకు మంచు లక్ష్మి చేస్తున్న ప్రయత్నం ఈ “మేము సైతం”. సహజంగానే సమాజ సేవ, సహాయ కార్యక్రమాల్లో ముందు ఉండే మంచు లక్ష్మి, సెలెబ్రెటీస్ ను సామాన్యులుగా మారుస్తూ వారి చరిష్మా ఆధారంగా నిదులు సేకరించి వాటిని సామాన్యుల సహాయార్ధం అందించేందుకు చేస్తున్న ప్రయత్నమే ఈ “మేము సైతం”. ప్రముఖ హింది ఛానెల్ లో ప్రసారం అవుతున్న “మిషన్ సప్నే” అనే కార్యక్రమం ఆధారంగా ఈ షో డిసైన్ చెయ్యబడింది. ఈ షో కోసం ఎందరో సెలెబ్రెటీస్ ఎన్నో చేస్తున్నారు. 30సెకెండ్స్ యాడ్ లో కోట్లు గడిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ కూకట్ పల్లి మార్కెట్ లో కూరగాయలు అమ్మి ఆ డబ్బులను పేదవారికి కోసం ఇవ్వనుంది. ఇక కాస్ట్లీ కారుల్లో తిరిగే టాలీవుడ్ కింగ్ నాగ్ కుమారుడు అక్కినేని అఖిల్, సామాన్యుల కష్టాలను తన కష్టంగా భావించి ఆటోవాలగా ఆటో తోలాడు. మూవీ ముఘల్ మనువడు, టాలీవుడ్ హీరో దగ్గుబాటి రాణా పేదవాళ్ల సహాయార్ధం రైల్వే స్టేషన్ లో బస్తాలు మొసాడు. అందాల భామ శ్రేయ సూపర్ మార్కెట్ లో సరుకులు అమ్మింది. హీరో, నిర్మాత అయినటువంటి మన కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గారు రోడ్డుపై టిఫిన్స్ అమ్మారు… న్యాచురల్ స్టార్ నాని మెకానిక్ గా పనిచేసాడు… సక్సెస్ఫుల్ హీరోయిన్ లావణ్య త్రిపాటీ చెరుకు రసం అమ్మింది. మరో భామ రెజినా బట్టల షాప్ లో బట్టలు అమ్మింది.. ఇలా సెలెబ్రెటీస్ అందరూ ముందుకు వచ్చి తమను అభిమానిస్తు, ఆదరిస్తున్న వారిలో ఎంతో మంది నిస్సహాయులకు అండగా నిలిచేందుకు, వారిలో ధైర్యాన్ని నింపేందుకు చేస్తున్న ఈ చిరు ప్రయత్నం ఘన విజయాన్ని సాధించి అందరికీ స్పూర్తిగా నిలవాలని ఆశిస్తున్నాం..

మంచు లక్ష్మి

దగ్గుబాటి రాణా

రకుల్ ప్రీత్ సింగ్

అక్కినేని అఖిల్

మోహన్ బాబు

శ్రేయ

నాని

లావణ్య త్రిపాటీ

రెజినా

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus