సెలబ్రిటీల మీద సైబర్ దాడులు జరగడం అనేది చాలా కామన్ విషయంగా మారిపోయింది. సోషల్ మీడియా అకౌంట్ల విషయంలో ఎప్పడూ ఎవరిదో ఒక అకౌంట్ హ్యాక్ అయినట్లు వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే యూట్యూబ్ ఛానళ్లు హ్యాక్ అవ్వడం మాత్రం చాలా తక్కువ. ఈ క్రమంలో మంచు లక్ష్మి తన కుమార్తె గురించి ‘చిట్టిచిలకమ్మ’ పేరుతో ఏర్పాటు చేసిన యూట్యూబ్ ఛానల్‌ను దుండగులు హ్యాక్ చేశారు. ప్రస్తుతం ఆ ఛానల్ యూట్యూబ్ సెర్చ్‌లో కనిపించడం లేదు. దీనిపై మంచు లక్ష్మి స్పందించింది.
‘చిట్టి చిలకమ్మ’ ఛానల్‌లో పిల్లలకు ఆసక్తికర పాఠాలు బోధిస్తుంటుంది మంచు లక్ష్మి. ఈ ఛానల్ హ్యాక్ అవ్వడంతో తన ఛానెల్ నుంచి ఏదైనా ఇబ్బందికరమైన కంటెంట్ వస్తే పట్టించుకోవద్దని లక్ష్మి సూచించింది. ఛానెల్‌ను తిరిగి యాక్టివ్ చేయడానికి తన టీం ప్రయత్నిస్తోందని.. త్వరలోనే ఛానెల్ తిరిగి లైవ్ చేస్తామని మంచు లక్ష్మి చెప్పింది. చిట్టి చిలకమ్మ ఛానల్లో కూతురు విద్యా నిర్వాణ మీద తీసిన వీడియోలను పోస్ట్ చేస్తుంటుంది. పిల్లల పెంపకం, వారికి చదువు చెప్పే విషయంలో అనుసరించాల్సిన పద్ధతులను వివరిస్తుంటుంది. ఈ ఛానల్‌లో వీడియోలు నెటిజన్లను బాగా ఆకర్షిస్తున్నాయి.
చిట్టి చిలకమ్మ యూట్యూబ్ ఛానల్‌ను హ్యాక్ చేస్తే దుండగులకు ఏమొస్తుందో మరి. పోనీ సోషల్ మీడియా అకౌంట్లను హ్యాక్ చేస్తే కాస్త వ్యక్తిగత సమాచారం అయినా దొరుకుతుంది. ఇందులో ఏముంటుంది. ఇదెవరో పేరు కోసం చేసిన పనే అని నెటిజన్లు అనుకుంటున్నారు. మంచు లక్ష్మి ఇలా తన వీడియోల ద్వారా మంచి చేద్దామని చూస్తుంటే ఇలా హ్యాక్ చేయడం ఏంటా అని ప్రశ్నిస్తున్నారు.
Most Recommended Video
థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!