మెగా ఫ్యామిలీకి చెందిన ఓ ఉత్సవానికి మంచు ఫ్యామిలీ నుండి హీరో వచ్చాడు… నమ్మడానికి కాస్త కష్టమే అయినా వచ్చారు ఇది నిజం. ఆ ఉత్సవం రామ్‌చరణ్ (Ram Charan) పుట్టిన రోజు వేడుకలు అయితే… ఆ వచ్చిన హీరో మంచు మనోజ్(Manchu Manoj) . రావడమే కాదు రామ్‌చరణ్ గొప్పతనాన్ని వివరించారు. ప్రసంగం ముగిస్తూ చిరంజీవి (Chiranjeevi) – మోహన్ బాబు (Mohan Babu) మధ్య ఉన్న బంధం గురించి కూడా చెప్పారు. ‘పెదరాయుడు’ సినిమా డైలాగ్‌ను కాస్త మార్చి భలేగా క్లారిటీ ఇచ్చారు.
రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా బుధవారం ఆయన అభిమానులు వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకకు అతిథిగా వచ్చిన మనోజ్ మాట్లాడుతూ రామ్ చరణ్ తనకు ప్రాణ మిత్రుడని, అలాంటి చరణ్ ఈవెంట్‌కు రావడం ఆనందంగా ఉందన్నాడు. ఏటా అభిమానులు గ్రాండ్‌గా సెలెబ్రేషన్స్ చేస్తున్నారని మెచ్చుకున్నాడు. రామ్ చరణ్ చిన్ననాటి స్నేహితులతో ఇప్పటికీ అలానే ఉన్నాడని, ఈ కాలంలో ఇలాంటి స్నేహం దొరకడం కష్టమని చెప్పాడు. స్థాయి పెరిగాక కొందరు కొత్త స్నేహాలతో బిజీగా ఉంటారని, కానీ చరణ్ అలా కాదని చెప్పాడు.
రామ్ చరణ్‌కు పక్కవారికి సాయం చేయడం అంటే ఇష్టమని, ఓ సారి ఓ కుటుంబం దుబాయిలో చిక్కుకుంటే ఇమ్మీడియట్‌గా రూ. ఐదు లక్షలు ఇచ్చి సాయం చేశాడని చెప్పాడు మనోజ్. ఓసారి తాను ఫోన్ చేసి ఓ ఆడ బిడ్డ కుటుంబం కష్టాల్లో ఉందని, నా వంతుగా నేను సాయం చేశాననొ, ఇంకా డబ్బు కావాల్సి ఉందని చరణ్‌కు ఫోన్ చేశాడట మనోజ్. దానికి స్పందించిన చరణ్ వెంటనే అకౌంట్ నెంబరు తీసుకొని డబ్బలు పంపించేశాడట.
ఇక చిరంజీవి, మోహన్ బాబు అలా గొడవలు పెట్టుకుంటారు కదా.. మరి వారి పిల్లలైన మీరు ఇంతకాలం స్నేహితులుగా ఎలా ఉంటున్నారు అని కొందరు తనను అడుగుతుంటారని మనోజ్ చెప్పాడు. భార్యాభర్తల గొడవల్లోకి మధ్యలోకి వెళ్తే ఏం అవుతుంది.. అలానే వారిద్దరి మధ్యలోకి ఇతరులు వెళ్తే అదే అవుతుందని అసలు విషయం చెప్పాడు. ఎందుకంటే వాళ్లిద్దరూ క్యూట్ టామ్ అండ్ జెర్రీ. వారిది 45 ఏళ్ల బంధం. అది అలానే కొనసాగుతుంది, కొనసాగాలని మనోజ్ ఆశించాడు. ఆఖరిగా ‘‘రిలేషన్ షిప్ బిట్వీన్ మంచు ఫ్యామిలీ అండ్ మెగా ఫ్యామిలీ షుడ్ బీ లైక్ ఫిష్ అండ్ వాటర్. బట్ నాట్ ఫిష్ అండ్ ఫిషర్ మెన్’ అంటూ డైలాగ్ చెప్పి అలరించాడు మనోజ్.
సైలెంట్ గా పెళ్లి పీటలెక్కిన ‘బిగిల్’ నటి ఇంద్రజ..!
కర్ణాటకలో సినిమాలు బ్యాన్ అంటున్నారు… మన దగ్గరా అదే చేస్తారా?
ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 18 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్