Manoj, Mounika: పాలిటిక్స్ విషయంలో మనోజ్, మౌనిక ప్లాన్ ఇదేనా?

మంచు మనోజ్, భూమా మౌనిక పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. మనోజ్, మౌనికలకు నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మనోజ్, మౌనిక కెరీర్ పరంగా ఎదగాలని ఫ్యాన్స్ సైతం కోరుకుంటున్నారు. భూమా మౌనికకు పొలిటికల్ బ్యాగ్రౌండ్ ఉందనే సంగతి తెలిసిందే. మౌనికకు పొలిటికల్ గా ఎదగాలనే కోరికలు కూడా ఉన్నాయని సమాచారం. రాబోయే రోజుల్లో మౌనిక, మనోజ్ రాజకీయాల్లో బిజీ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని తెలుస్తోంది.

మనోజ్ సోషల్ మీడియా పోస్ట్ లో మంచు లక్ష్మిని మెచ్చుకుంటూ పోస్ట్ పెట్టగా మోహన్ బాబు ఫ్యామిలీలోని మిగతా కుటుంబ సభ్యులకు ఈ పెళ్లి ఇష్టం లేదా అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. మనోజ్, మౌనికల పెళ్లికి సంబంధించి పూర్తి క్రెడిట్ మంచు లక్ష్మికి దక్కనుంది. ఏ జన్మలోనో చేసుకున్న పుణ్యం వల్లే మంచు లక్ష్మి లాంటి మంచి అక్క దొరికిందని మనోజ్ ప్రస్తావించినట్లు తెలుస్తోంది. మంచు మనోజ్ పెళ్లి గురించి రాబోయే రోజుల్లో మోహన్ బాబు, విష్ణు స్పందించే అవకాశం ఉంది.

మంచు మనోజ్ కూడా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తే సక్సెస్ కావడం ఖాయమని కామెంట్లు వినిపిస్తున్నాయి. మనోజ్ పొలిటికల్ ప్లానింగ్ ఏ విధంగా ఉండనుందో తెలియాల్సి ఉంది. మనోజ్ రాజకీయాలకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. అటు సినిమాల్లో, ఇటు రాజకీయాల్లో మంచు మనోజ్ సంచలనాలు సృష్టించాలని అభిమానులు కోరుకుంటున్నారు. మంచు మనోజ్ సొంత బ్యానర్లలోనే కాకుండా బయటి బ్యానర్లలో కూడా నటించాలని అభిమానులు కోరుకుంటున్నారు.

మనోజ్ కెరీర్ విషయంలో జాగ్రత్తగా అడుగులు వేయాలని ఫ్యాన్స్ భావిస్తుండటం గమనార్హం. మంచు మనోజ్ భవిష్యత్తు ఇంటర్వ్యూలలో పొలిటికల్ ప్లాన్స్ కు సంబంధించి , సినిమా ప్లాన్స్ కు సంబంధించి స్పష్టత రావాల్సి ఉంది. మంచు మనోజ్ కథ నచ్చితే మల్టీస్టారర్స్ లో కూడా నటించాలని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus