Manoj, Mounika: తల్లిదండ్రులు కాబోతున్న మౌనిక, మనోజ్.. గుడ్ న్యూస్ చెప్పిన హీరో?

మంచు వారసుడిగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నటువంటి మంచు మనోజ్ ఈ ఏడాది మొదట్లో భూమా మౌనిక రెడ్డిని రెండవ వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే ఇక వీరికి ఇది రెండో పెళ్లి కావటం విశేషం ఇదివరకే భూమా మౌనికకు ఒక కుమారుడు కూడా ఉన్నారు. ఇక పెళ్లి తర్వాత భూమా మౌనికతో పాటు తన కుమారుడు ధైరవ్ రెడ్డి బాధ్యతలను కూడా మనోజ్ తీసుకున్నారు. ఇక పెళ్లి తర్వాత మనోజ్ కూడా కెరియర్ పరంగా ఎంతో బిజీ అయ్యారు.

ప్రస్తుతం సినిమాలకు మనోజ్ కమిట్ అవ్వడమే కాకుండా మరోవైపు బుల్లితెరపై ఉస్తాద్ అనే కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ఇకపోతే నేడు మంచు మనోజ్ సోషల్ మీడియా వేదికగా అభిమానులకు గుడ్ న్యూస్ తెలియజేశారు. మౌనిక మనోజ్ ఇద్దరు కూడా తల్లిదండ్రులు కాబోతున్నట్లు ఈయన వెల్లడించారు. నేడు తన అత్తయ్య శోభా నాగిరెడ్డి జయంతి కావడంతో ఈ శుభవార్తను ఈయన అభిమానులతో పంచుకున్నారు.

అత్తయ్య శోభనాగిరెడ్డి ఆశీస్సులతో మేము శుభవార్తను పంచుకోబోతున్నాము శోభ నాగిరెడ్డి అలాగే భూమనాగిరెడ్డి మామయ్య మీరు గ్రాండ్ పేరెంట్స్ గా ప్రమోట్ కాబోతున్నారు అంటూ ఈయన తెలిపారు. అలాగే మా ధైరవ్ కూడా అన్నయ్య కాబోతున్నారు అంటూ ఈయన తెలిపారు. అదేవిధంగా తన తల్లి నిర్మలాదేవి మోహన్ బాబు గారి ఆశీస్సులు కూడా ఎప్పుడు తన కుటుంబానికి ఉండాలని ఈ శుభవార్తను అభిమానులతో పంచుకున్నారు.

ఈ విధంగా మరోసారి మౌనిక తల్లి కాబోతున్నారన్న వార్త తెలియచేయడంతో అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తూ మంచు మనోజ్ కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక మనోజ్ (Manoj) సినిమాల విషయానికి వస్తే ఈయన వాట్ ది ఫిష్ అనే సినిమాకు కమిట్ అయ్యారు.

https://twitter.com/HeroManoj1/status/1736018854567153832

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus