Manchu Manoj, Ram Gopal Varma: ఆర్జీవీ ట్వీట్ కి మనోజ్ ఘాటు రిప్లై!

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఎన్నికలు ముగిసి పదిరోజులు గడుస్తున్నా.. ఇప్పటికీ ఏదొక వివాదం చెలరేగుతూనే ఉంది. ‘మా’కు అన్యాయం జరిగిందని.. ఎన్నికల్లో అవకతవకలు జరిగాయంటూ అధ్యక్ష పదవికి పోటీ చేసి ఓడిపోయినా ప్రకాష్ రాజ్ ఆరోపించారు. అంతేకాదు.. సోమవారం ‘మా’ ఎన్నికల పోలింగ్ సీసీ కెమెరాల ఫుటేజీని పోలీసులు సమక్షంలో పరిశీలించారు. మరోపక్క మంచు విష్ణు.. ప్రకాష్ రాజ్ చేసే ఆరోపణల్లో అర్ధం లేదని, ప్రజాస్వామ్య పద్దతిలోనే గెలిచామని చెబుతున్నారు.

ఎన్నికలు ముగిసిన తరువాత కూడా ఇలా ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడంపై సినీ పెద్దలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తాజాగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా ‘మా’ వివాదాలపై స్పందించారు. సోషల్ మీడియా వేదికగా తనదైన స్టయిల్ లో వర్మ ట్వీట్ చేశారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఓ సర్కస్ అని.. అందులో ఉండే సభ్యులంతా జోకర్లంటూ వర్మ సంచలన కామెంట్స్ చేశారు.

ప్రస్తుతం వర్మ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై మంచు మనోజ్ తనదైన స్టైల్ లో కౌంటర్ ఇచ్చారు. ‘మా’ ఒక సర్కస్ అయితే.. మీరు రింగ్ మాస్టర్ అంటూ కామెంట్ చేశాడు. మరి దీనిపై వర్మ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి!

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

మహా సముద్రం సినిమా రివ్యూ & రేటింగ్!
ఒక్కో సినిమాకు ఈ స్టార్ హీరోలు ఎంతెంత డిమాండ్ చేస్తున్నారో తెలుసా?
టాలీవుడ్ లో బి.టెక్ చదువుకున్న 10 మంది లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus