Manchu Manoj: ‘మిరాయ్’ తో పాటు మనోజ్ ఆ క్రేజీ సినిమాలో కూడా నటిస్తున్నాడా?

రాజమౌళి (SS Rajamouli)  తర్వాత సక్సెస్ ఫుల్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు అనిల్ రావిపూడి (Anil Ravipudi). ఇతని ట్రాక్ రికార్డు గమనిస్తే.. ఇప్పటికీ వరకు 7 సినిమాలు చేశాడు. అన్నీ సక్సెస్ అయ్యాయి. వంద శాతం హిట్ పర్సెంటేజీ ఉన్న దర్శకుడు కావడంతో.. పెద్ద హీరోలు, పెద్ద నిర్మాతలు ఇతనితో సినిమాలు చేయడానికి ఎగబడుతున్నారు. ముఖ్యంగా సీనియర్ హీరోలు అనిల్ రావిపూడితో సినిమా అంటే వెంటనే ఒక చెప్పేస్తున్నారు. బాలకృష్ణతో (Nandamuri Balakrishna)  ‘భగవంత్ కేసరి’ (Bhagavanth Kesari)  చేసి బ్లాక్ బస్టర్ కొట్టిన అనిల్ రావిపూడి ప్రస్తుతం వెంకటేష్ తో  (Venkatesh Daggubati) ఓ సినిమా చేస్తున్నాడు.

ఆల్రెడీ వీరి కాంబినేషన్లో ‘ఎఫ్ 2’  (F2: Fun and Frustration)  ‘ఎఫ్ 3’ (F3: Fun and Frustration) వంటి హిట్ సినిమాలు వచ్చాయి. ఇది హ్యాట్రిక్ మూవీ. ఇదిలా ఉండగా.. వెంకటేష్ – అనిల్ రావిపూడి..ల హ్యాట్రిక్ మూవీలో మంచు మనోజ్ (Manoj Manchu) కూడా కీలక పాత్ర పోషిస్తున్నట్టు ప్రచారం మొదలైంది. కథ ప్రకారం సినిమాలో ఓ ముఖ్య పాత్ర ఉందని.. దానికి ఇంకో హీరో అవసరం అని ఆ వార్తల సారాంశం. అయితే అందుతున్న సమాచారం ప్రకారం..

అలాంటిదేమీ లేదు అని తెలుస్తుంది. మంచు మనోజ్ ని  ఈ సినిమా కోసం మేకర్స్ అప్రోచ్ అవ్వలేదట. అసలు ఈ కథలో ఇంకో హీరో అవసరం లేదని కూడా చిత్ర బృందం చెబుతోంది. సో ఈ వార్తల్లో నిజం లేదన్న మాట. ఇక ఈ ప్రాజెక్టుని దిల్ రాజు (Dil Raju)  నిర్మిస్తున్నారు.2025 జనవరి సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus