మంచు మనోజ్ భార్య గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

కొన్ని గంటల క్రితం మనోజ్, భూమా మౌనికల వివాహం గ్రాండ్ గా జరిగిందనే సంగతి తెలిసిందే. మనోజ్, మౌనికల పెళ్లిని చూసి ఇద్దరి అభిమానులు తెగ సంతోషిస్తున్నారు. కలకాలం ఈ జంట సంతోషంగా ఉండాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. త్వరలో ఈ జంట మరిన్ని శుభవార్తలు చెప్పాలని ఫ్యాన్స్ చేస్తున్న కామెంట్లు తెగ వైరల్ అవుతున్నాయి. అయితే భూమా మౌనిక గురించి, ఆమె బ్యాగ్రౌండ్ గురించి చాలామందికి తెలియదు. మౌనిక అసలు పేరు మౌనికా రెడ్డి కాగా ఈమె భూమా నాగిరెడ్డి, భూమా శోభారెడ్డిల రెండో కుమార్తె కావడం గమనార్హం.

చాలా సంవత్సరాల నుంచి మంచు, భూమా కుటుంబాల మధ్య మంచి అనుబంధం ఉంది. మౌనిక 2016 సంవత్సరంలో గణేష్ రెడ్డి అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ధైరవ్ రెడ్డి అనే కొడుకు ఉన్నాడు. మౌనిక గణేష్ మధ్య బేధాభిప్రాయాలు రావడంతో వీళ్లిద్దరూ విడిపోయారు. భూమా మౌనికది కర్నూలులోని ఆళ్లగడ్డ నియోజకవర్గం కాగా చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఈమెకు మంచి పేరుంది. ఈమె తల్లీదండ్రులు రాజకీయాల్లో ఎన్నో సంచలనాలు సృష్టించి వార్తల్లో నిలిచారు.

అటు మనోజ్ సైతం మొదటి భార్య ప్రణతి రెడ్డికి కొన్ని కారణాల వల్ల విడాకులు ఇచ్చారు. అటు మనోజ్ ఇటు మౌనికకు ఈ పెళ్లి రెండో పెళ్లి కావడం గమనార్హం. మనోజ్, మౌనిక జోడీ బాగుంటుందని కొంతమంది సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. మనోజ్ మౌనికల మధ్య స్నేహం ప్రేమగా మారి పెళ్లి వరకు వచ్చింది. గత కొన్ని నెలలుగా ప్రేమలో ఉన్న మనోజ్ మౌనిక కుటుంబ సభ్యులను ఒప్పించి పెళ్లి చేసుకుంటున్నారు.

మోహన్ బాబుకు ఈ పెళ్లి ఇష్టం లేదని తెలుస్తోంది. మనోజ్ మౌనిక పెళ్లికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మనోజ్ ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మనోజ్ నటిస్తున్న సినిమాలు సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus