మంచు విష్ణు – విరానిక 14 వ పెళ్లి రోజు సెలబ్రేషన్స్ .. వైరల్ అవుతున్న ఫోటోలు

  • March 1, 2023 / 01:28 PM IST

డైలాగ్ కింగ్, కలెక్షన్ కింగ్ అయిన మంచు మోహన్ బాబు కుటుంబ సభ్యులను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన పెద్ద కుమారుడు మంచు విష్ణు ప్రస్తుతం మా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. విష్ణు… ఉమ్మడి ఆంద్రప్రదేశ్… దివంగత ముఖ్యమంత్రి అయిన వై. యస్.రాజశేఖర్ రెడ్డి సోదరుడి కూతురు విరానికా రెడ్డిని ప్రేమించి 2009 లో పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. విష్ణు- విరానికా దంపతులకు నలుగురు సంతానం.

నటుడిగా, నిర్మాతగా (24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ), మా అసోసియేషన్ అధ్యక్షులుగా, శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థల్లో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తూ నిత్యం బిజీగా గడుపుతున్నాడు మంచు విష్ణు. ఇక విష్ణు భార్య విరానికా రెడ్డి డిజైనర్ గా చేస్తూనే మోహన్ బాబు విద్యా సంస్థల్లోని న్యూయార్క్ అకాడమీ డైరెక్టర్ గా బాధ్యతలు చేపట్టి విజయవంతంగా రాణిస్తుంది. లండన్, దుబాయ్, దోహ వంటి వివిధ దేశాల్లో కూడా బోటిక్ సంబంధించిన బ్రాంచ్ లను నెలకొల్పడానికి సిద్దమైంది.

విష్ణు -విరానికా వేరు వేరు రంగాల్లో ఉన్నా సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్నారు. ఇక ఈరోజు వీరి 14 వ పెళ్లి రోజు. దీంతో సోషల్ మీడియాలో నెటిజన్లు వీరికి తమ బెస్ట్ విషెస్ ను తెలియజేస్తున్నారు. వీరి పెళ్లి రోజుకు సంబంధించిన స్పెషల్ పిక్స్ కూడా వైరల్ గా మారాయి. మీరు కూడా ఓ లుక్కేయండి :

 

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus