మంచు వారి వారసుడు, టాలీవుడ్ యువ హీరో విష్ణు కు ఈ మధ్య టైమ్ అస్సలు కలసి రావడం లేదు. తీసిన ప్రతీ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అనుకున్నంత హిట్ కాకపోతూ ఉండడంతో కాస్త దిగాలు గా ఉన్న ఈ హీరోకు నిన్న విడుదలయిన “ఆడోరకం..ఈడోరకం” సినిమా కాస్త ఊపిరిని ఇచ్చింది. ఈ సినిమాకు బెన్ఫిట్ షో నుంచే మంచి హిట్ టాక్ రావడంతో ఇక పైసా వసూళ్లపై ఫోకస్ పెట్టింది ఈ చిత్రం యూనిట్. అందులో భాగంగానే హీరో విష్ణు వరుసగా టీవీ ఛానెళ్లకు పత్రికలకు ఇంటర్‌వ్యూస్ ఇస్తూ సినిమాను సరికొత్తగా ప్రమోట్ చేస్తున్నాడు. అయితే ఒక సినిమా కాస్త హిట్ టాక్ తెచ్చుకుందో లేదో, మంచు విష్ణు మాటల్లో కాస్త తేడా కనిపిస్తుంది అని సినీ సర్కిల్స్ నుంచి వినిపిస్తున్న మాట. ఇంతకీ విషయం ఏంటంటే, సినిమా ప్రమోషన్ లో భాగంగా ఒక ప్రముఖ దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో విష్ణు నేటి తరం దర్శకులపై కాస్త ఘాటుగా మాట్లాడాడు. ఈ మధ్యనే విడుదలయ్యి మంచి సక్సెస్ సాధించి, కలెక్షన్స్ లో సరికొత్త రికార్దుని సృష్టిస్తున్న ‘ఊపిరి’ ‘క్షణం’ లాంటి కొత్త కాన్సెప్టు సినిమాలలో నటించ వచ్చు కదా అని మీడియా ప్రశ్నించినప్పుడు, విష్ణు స్పందిస్తూ….మంచి కథలను సినిమాలుగా తీసే దర్శకులు ఎక్కడ ఉన్నారు అంటూ దర్సకులపై కాస్త వెటకారం పెంచి మాట్లాడాడు. అంతేకాకుండా ‘జగదేకవీరుడు-అతిలోక సుందరి’ ‘అసెంబ్లీ రౌడీ’ లాంటి కథలను తనకూ చెయ్యాలి అని ఉంది అని, డైరెక్టర్లను తెమ్మనండి, వారి అలాంటి కధలతో వస్తే నేను నటించడానికి రెడీ అంటూ డైరెక్టర్స్ కు సవాల్ విసిరాడు విష్ణు. ఇక సినిమాలో కేరక్టర్ విషయంలో కూడా పెద్దగా పట్టించుకోనని, తన కేరక్టర్ ఎంత లెంగ్త్ ఉంటుందనే విషయాన్ని కూడా ఆలోచించకుండా ఐదు నిమిషాల పాత్రలో అయినా తాను రెడీ అంటూ నేటి తరం దర్శకులకు ఓపెన్ చ్యాలెంజ్ చేస్తున్నాడు విష్ణు. మరి ఒక్క సినిమాకే ఈ హీరో ఇలా మాట్లాడితే, వరుస హిట్స్ తో దూసుకుపోతున్న హీరోలు ఇంకెలా మాట్లాడతారో.