అలాంటి వ్యక్తికి గౌరవం ఉండదంటున్న విష్ణు

సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చి చాలా సంవత్సరాలే అయినా సరైన హిట్లు లేక కెరీర్ విషయంలో ఒడిదొడుకులు ఎదుర్కొంటున్న హీరోలలో మంచి విష్ణు ఒకరు. మంచి విష్ణు, కాజల్ ప్రధాన పాత్రల్లో నటించిన మోసగాళ్లు సినిమా ఈ నెల 19వ తేదీన విడుదల కానుంది. ఈ సినిమాతో మళ్లీ సక్సెస్ ట్రాక్ లోకి వస్తానని విష్ణు భావిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూలు ఇస్తున్న మంచు విష్ణు ఇంటర్వ్యూల్లో ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

తాను పార్టీలకు దూరంగా ఉంటానని సాంప్రదాయాలను ఎక్కువగా గౌరవించడం వల్లే తాను పార్టీలకు దూరంగా ఉండాలని అనుకుంటానని విష్ణు తెలిపారు. చెల్లి, మనోజ్ పార్టీలకు వెళ్లినా తాను వెళ్లనని విష్ణు అన్నారు. తాను కొద్దిగా బోరింగ్ పర్సన్ అని.. పెద్దా చిన్న అనే పద్ధతులను నమ్ముతానని విష్ణు తెలిపారు. లక్ష్మి, మనోజ్ ల లైఫ్ స్టైల్ తనతో పోలిస్తే భిన్నంగా ఉంటుందని విష్ణు పేర్కొన్నారు. లక్ష్మి, మనోజ్ ల ఆలోచనలు కొంతవరకు మ్యాచ్ అవుతాయని బుక్స్ చదవడం, పిల్లలతో సమయం గడపడం తన హాబీలని విష్ణు వెల్లడించారు.

తాను మనోజ్ కు ఎటువంటి సలహాలు ఇవ్వనని.. అడగకుండా సలహాలు ఇస్తే సలహాలు ఇచ్చే వ్యక్తి మాటకు విలువ ఉండదని, సలహాలు ఇచ్చే వ్యక్తికి కూడా గౌరవం ఉండదని విష్ణు అన్నారు. అవసరమైతే వాళ్లు సలహాలు అడుగుతారని అడిగితే మాత్రం తాను తప్పకుండా సలహాలు ఇస్తానని విష్ణు చెప్పుకొచ్చారు. ప్రపంచంలోని అతిపెద్ద ఐటీ కుంభకోణం ఆధారంగా మోసగాళ్లు మూవీ తెరకెక్కుతోంది. విష్ణు, కాజల్ ఈ సినిమాలో అక్కాతమ్ముళ్లుగా నటించనున్నారు. విష్ణు, కాజల్ కలిసి ఒకే సినిమాలో నటించడం ఇదే తొలిసారి. పెళ్లి తరువాత కాజల్ నటిస్తూ విడుదలవుతున్న ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాల్సి ఉంది. బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి ఈ సినిమాలో విలన్ గా నటిస్తుండగా జెఫ్రీ గీ చిన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.

Most Recommended Video

శ్రీకారం సినిమా రివ్యూ & రేటింగ్!
జాతి రత్నాలు సినిమా రివ్యూ & రేటింగ్!
గాలి సంపత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus