Manchu Vishnu: నాన్నకు ప్రేమతో ఖరీదైన కారును గిఫ్ట్ గా ఇచ్చిన విష్ణు!

Advertisement

మంచు కుటుంబం గత కొద్దిరోజులుగా పెద్ద ఎత్తున ఈ పేరు సోషల్ మీడియాలో వినపడుతోంది.మంచు మనోజ్ పెళ్లి కారణంగా గత కొంతకాలంగా మంచు వారి పేరు సోషల్ మీడియాలో మారుమోగుతుంది. మంచు కుటుంబానికి ఇష్టం లేకపోయినా మనోజ్ కోసం భూమా మౌనికతో పెళ్లికి అంగీకరించారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఇక ఈ పెళ్లి జరిగిన కొద్ది రోజులకే మనోజ్ విష్ణు మధ్య ఉన్నటువంటి గొడవలు బయటపడ్డాయి. మనోజ్ విష్ణు మధ్య విభేదాలు ఉన్నాయని వార్తలు వచ్చిన తాజాగా ఓ వీడియో ద్వారా వీరిద్దరి మధ్య ఉన్నటువంటి విభేదాలు బయటపడ్డాయి.

అయితే తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని ఏదో ఒక రియాలిటీ షో కోసం అంటూ (Manchu Vishnu) మంచు విష్ణు ఈ గొడవను కప్పిపుచ్చే ప్రయత్నం చేసిన ఇద్దరు మధ్య నిజంగానే గొడవలు ఉన్నాయని కొందరు వాదిస్తున్నారు. ఇక విష్ణు మనోజ్ మధ్య గొడవలు ఉన్న తన తండ్రి మోహన్ బాబు మాత్రం విష్ణు వద్ద ఉన్నారని తెలుస్తోంది. ఇకపోతే మార్చి 19వ తేదీ మోహన్ బాబు పుట్టినరోజు వేడుకలను జరుపుకున్న విషయం మనకు తెలిసిందే.

ఈయన పుట్టిన రోజు వేడుకలను తిరుపతిలోని మోహన్ బాబు కళాశాలలో ఎంతో ఘనంగా నిర్వహించారు. అయితే ఈ వేడుకలకు మంచు విష్ణు దూరంగా ఉన్నప్పటికీ మనోజ్ సందడి చేసి పెద్ద ఎత్తున పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు.ఇకపోతే తన తండ్రి పుట్టిన రోజు సందర్భంగా విష్ణు తన తండ్రికి ఒక ఖరీదైన కారును కానుకగా ఇచ్చారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే విష్ణు తన తండ్రికి ఏకంగా ఐదు కోట్ల విలువ చేసే ఖరీదైన రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ ఎస్‌యూవీని విష్ణు గిఫ్ట్‌గా ఇచ్చాడని వార్తలు షికారు చేస్తున్నాయి.

ఈ కస్టమ్ మేడ్ రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ విలువ. రూ. 5.25 కోట్లు అని సమాచారం. అయితే విష్ణు తన తండ్రికి ఇలాంటి ఖరీదైన కారును గిఫ్ట్ గా ఇచ్చారని ఎక్కడ వెల్లడించకపోవడం గమనార్హం. ప్రస్తుతం విష్ణు తన తండ్రికి ఖరీదైన గిఫ్ట్ ఇచ్చారని ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Also Read

latest news